‘ కూలీ ‘లో మౌనిక సాంగ్ అందుకే పెట్టాం.. లోకేష్ కనకరాజ్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ లీక్..

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబోలో తెర‌కెక్కనున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఆగ‌ష్టు 14న ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. పాజిటివ్ రివ్యూ వస్తే మాత్రం తమిళ్ ఇండస్ట్రీలో కూలి ఆల్ టైం రికార్డ్‌ను క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమ సైతం రిలీజై భారీ లెవెల్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అనిరుధ్‌ మ్యూజిక్ డైరెక్షన్‌లో రూపొందిన ప్రతి సాంగ్.. ఆడియ‌న్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ కాంబోలో వచ్చిన మౌనిక సాంగ్.. ప్లే లిస్టులో ఇప్పటికి టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. సౌఐబిన్ షాహిర్ డ్యాన్స్ స్టెప్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి.

ఇలాంటి క్రమంలోనే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు టీం. ఇందులో భాగంగా.. లోకేష్ కనకరాజ్‌ మాట్లాడుతూ.. అసలు సినిమాలో మౌనిక సాంగ్ ఎందుకు పెట్టారు అనే సీక్రెట్ ను రివిల్ చేశాడు. త‌ను మాట్లాడుతూ అసలు నేను మౌనిక సాంగ్ ను కేవలం బిజినెస్ బెనిఫిట్స్ కోసమే సినిమాలో యాడ్ చేశానంటూ క్లారిటీ ఇచ్చాడు. నా సినిమాల్లో సాధారణంగా ఐటెం సాంగ్స్ ఉండనే ఉండవు. కానీ.. మౌనిక అనేది ఒక అదిరిపోయే సాంగ్. ఇది సినిమా ఫ్లో తగ్గించకుండా మరింత హైప్‌ను పెంచేలా ఉంది.

Coolie - Second Single | Monica | Super Star RajiniKanth | Pooja Hegde |  Lokesh Kanagaraj | Anirudh - YouTube

ఈ క్రమంలోనే.. సాంగ్ మూవీలో యాడ్ చేశామంటే చెప్పుకొచ్చాడు. జైలర్‌లో కావాలయ్య‌ పాటలో రజనీకాంత్ సార్ డాన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ.. కూలీలో ఆ స్పేస్ లేదు. ఈ క్రమంలోనే.. సౌబిన్ నుంచి సాంగ్ డిజైన్ చేయిచ్చామంటూ వివరించాడు. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్గా మెరుస్తుండగా.. సౌభిన్ షాహిర్, నాగార్జున, సత్యరాజ్, మహేంద్రన్‌, రేబా మౌనిక జాన్, ఉపేంద్ర, కిషోర్ కుమార్ తదితరులు కీలక పాత్రలో మెరువనున్నారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించగా.. సన్ పిక్చర్ బ్యానర్ పై కలానిది మారన్ ప్రొడ్యూసర్ గా రూపొందింది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ లెవెల్ హైప్ నెలకొంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.