పాస్టర్ పవన్ కళ్యాణ్ నటించిన భారీ పిరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈరోజు రాత్రి 9 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోస్ సందడి చేయనున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా.. ఇప్పటికే ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియన్ సినిమా కావడం.. పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో.. సినిమా పై ఫ్యాన్స్ మరింత బజ్ క్రియేట్ చేస్తూ.. పక్క బ్లాక్ బస్టర్ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సోషల్ మీడియాలో ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్న బిగ్గెస్ట్ థియేటర్ ఏఏఏ లో హరిహర వీరమల్లు షోలు రిలీజ్ చేయడం లేదని.. వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. అల్లు అర్జున్‌కు సంబంధించిన ఈ పెద్ద థియేటర్లో సాధారణంగా అన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ.. పవన్, వీరమల్లు సినిమా మాత్రం ఈ థియేటర్ లిస్టులో లేకపోవడంతో అంతా షాక్‌కు గురవుతున్నారు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభమై బుక్ మై షో యాప్ లో హైదరాబాద్‌లోని చాలా థియేటర్లలో వీరమల్లు షోలు కనిపిస్తున్న క్రమంలో.. అల్లు అర్జున్ థియేటర్ ఈ లిస్టులో లేకపోవడం షాక్.
ఇది చూసిన వీకమల్లు ఫ్యాన్స్.. మెగా, అల్లు వార్ కారణంగానే బన్నీ థియేటర్లో పవన్ సినిమా ప్రదర్శించడం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు.. బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్యన స్ట్రాంగ్ వార్ మొదలైంది. గతంలో కూడా మెగా ఫ్యామిలీ అంతర్గత రాజకీయాలపై వార్తలు వినిపించాయి. ఇప్పుడు థియేటర్లో విషయంలో మరోసారి ఈ వివదం జోరందుకుంది. అయితే.. ఈ రెండు కుటుంబాల విభాగానికి నిజమైన కారణమేంటనేది మాత్రం క్లారిటీ లేదు. కాగా బన్నీ థియేటర్లలో పవన్ సినిమాలు లేకపోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.