ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ సాధించి.. పాన్ ఇండియన్ స్టార్లుగా రాణిస్తున్న నటులు ఎంతో మంది ఉన్నారు. మార్కెట్‌కు తగ్గట్టు కోట్ల రమ్యునరేషన్ అందుకుంటూ.. రిచెస్ట్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అలా ఇండస్ట్రీలో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తు.. రకరకాలుగా తమ నచ్చిన వస్తువులపై కోట్లు ధారపోస్తున్నారు. అంతేకాదు సౌత్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ఎంతోమంది స్టార్ హీరోలు ఏకంగా సొంత విమానాలు సైతం కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ హీరోల లిస్ట్ ఒకసారి చూద్దాం
చిరంజీవి, నాగార్జున:
టాలీవుడ్ లో మెగాస్టార్ గా దూసుకుపోతున్న చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ కోట్లల్లో అర్జిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలతో పాటు.. బిజినెస్ లోను సత్తా చాటుకుంటున్నారు. అయితే.. అవసరానికి మాత్రమే ఆ జట్ ఉపయోగిస్తూ.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాటిని వాడుతూ ఉంటారు. మిగతా సమయంలో ఈ జట్ కమర్షియల్ గా రెంట్‌కు ఇచ్చి డబ్బు కూడబెడుతున్నారు.
రజినీకాంత్:
కోలీవుడ్ తలైవాగా తిరుగులేని ఫేమ్ అందుకకున్న రజినీకాంత్.. టాలీవుడ్‌లోను అదే రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఇక రజనీకాంత్.. తన వయసు, ఆరోగ్య సమస్యల దృష్ట్యా.. దూర ప్రయాణాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని ఓ సంత జట్ కొనుగోలు చేశారట.
రామ్ చరణ్:
గ్లోబల్ స్టార్‌గా పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్తో దూసుకుపోతున్న చరణ్ సైతం వివిధ రకాల బిజినెస్ రంగాల్లో రాణిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ట్రూజాట్ అనే ఓ ప్రాంతీయ ఎయిర్ లైన్స్ కంపెనీ రన్ చేయడం విశేషం. ఈ కంపెనీ విమానాలతో పాటు.. తన పర్సనల్ జర్నీల కోసం ఆ ప్రైవేట్ జట్టును ఉపయోగిస్తూ ఉంటాడు. ఇక ఈ జట్.. తన సినిమాలో షూటింగ్స్, ప్రమోషన్స్, అలాగే ఈవెంట్లు, ఫ్యామిలీ టూర్ల కోసం కూడా ఉపయోగిస్తారు.
అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్.. బన్నీ సైతం ఇలా సొంతమైన ప్రైవేట్ జట్ కొనుగోలు చేశాడు. ఆరు సీట్లు ఉన్న ఈ జట్.. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ ఈవెంట్స్ కు, సినిమా ఈవెంట్స్ కు, అలాగే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ట్రిప్స్ వేసేందుకు ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ జట్టు మిగతా హీరోలలానే కమర్షియల్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తన పెళ్లి సమయంలో ఈ జట్.. తన భార్య స్నేహ రెడ్డికి బహుమతిగా ఇచ్చాడట.
ఎన్టీఆర్:
పాన్ ఇండియన్ హీరోగా ఎన్టీఆర్.. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక ఆయన లగ్జరి లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడడానికి సింపుల్గా కనిపించిన.. ఎన్టీఆర్ ధరించే వాచ్లు, ఆయన ఉపయోగించే కార్లు చాలా ఎక్స్టెన్సీవ్‌గా ఉంటాయి. ఇకఎన్టీఆర్ ఓ ప్రైవేట్ జట్ కూడా కొనుగోలు చేశాడుజ దాని విలువ సుమారు రూ.8 కోట్లని.. పర్సనల్ ట్రిప్స్ కోసం మాత్రమే ఈ జట్టు ఉపయోగిస్తారని టాక్.
మహేష్ బాబు:
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఎస్ఎస్ఎంబి 29 పనులో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో వరల్డ్ వైడ్ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్. ఇక మహేష్ టాలీవుడ్ లో ఎక్కువగా విదేశాలకు వెళ్లే హీరో అనడంలో అతిశయోక్తి లేదు. ఇక మహేష్ కు సైతం ఓన్ జట్ ఉంది. అయితే ప్రతి వెకేషన్‌కు ఈ విమానంలోనే ప్రయాణించరు. అప్పుడప్పుడు మాత్రమే..ఈ జట్ వినాయోగిస్తారు. సినిమా షూటింగ్‌లో, బ్రాండ్ అంబాసిడర్స్మెంట్ ఈవెంట్ల కోసం.. ఇతర రాష్ట్రాలు లేదా నగరాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు చాలా తక్కువగా మాత్రమే ఈ జట్టు ఉపయోగిస్తూ ఉంటాడు.