టాలీవుడ్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్.. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి హిట్‌ను అందుకున్న కీర్తి.. తర్వాత వరుస సిపిమాల ఆఫర్లు కొట్టేసింది.అంతేకాదు.. అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా రూపొందిన మహానటి సినిమాలో నటించి నేషనల్ అవార్డును దక్కించుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళ్లోను కీర్తికి తిరుగులేని పాపులారిటి దక్కింది. అంతేకాదు.. రీసెంట్గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రం సరైన సక్సెస్ అందుకోలేకపోయింది.
అయినా అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న కీర్తి.. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. కాగా.. తాజాగా కీర్తి సురేష్ నటించిన ఉప్పుకప్పురంబు సినిమా.. ధియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉప్పు కప్పురంబు నేడు గ్రాండ్ లెవెల్ లో స్ట్రిమింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో నిన్న మొన్నటి వరకు సందడి చేసిన కీర్తి.. ఈ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ సుమ ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది.
ఇక ఇంటర్వ్యూలో కీర్తిని ఒకవేళ మళ్లీ లాక్ డౌన్ వచ్చేస్తే.. ఏ హీరోతో ఉండడానికి ఇష్టపడతారని సుమ ప్రశ్నించగా.. నాని పేరు చెప్పుకొచ్చింది. నాని, తన వైఫ్ అంజు, నాని కొడుకు అర్జున్‌తో కలిసి ఉండాలని నేను కోరుకుంటా అంటూ కీర్తి వివరించింది. ప్రస్తుతం కీర్తి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారుతున్నాయి. ఇక కీర్తి సురేష్, నాని మొదటి నుంచి మంచి స్నేహితులను సంగతి అందరికి తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి నేను లోకల్, దసరా సినిమాల్లో మెరిసారు. ఈ రెండు సినిమాల షూట్ టైంలో వీరిద్దరి మధ్యన పరిచయం కాస్త స్నేహంగా మారడం.. నానితోపాటు ఆయన ఫ్యామిలీతోనూ కీర్తి చాలా సన్నిహితంగా ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ఉప్పు కప్పురంబు ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నాని ఆ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. మూవీ టీంకు విషెస్ సైతం తెలియజేశాడు.