ప్రభాస్ ప్రాజెక్ట్ కొట్టేసిన అల్లు అర్జున్.. ప్రొడ్యూసర్ క్లారిటీ..!

నితిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు. జూలై 4న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత దిల్ రాజు పలు ఇంట‌ర్వ్యూల‌లో సంద‌డి చేస్తున్నాడు. ఇందులో భాగంగానే భవిష్యత్తు సినిమాలపై ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్‌లు షేర్ చేసుకున్నాడు. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. త్వరలోనే ఆయన అల్లు అర్జున్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నట్లు చెప్పుకొచ్చాడు.

Telugu Times | International Telugu News

ఈ సినిమా టైటిల్ రావ‌ణం అంటూ ప్రకటించిన దిల్ రాజు.. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్‌ తమ కమిట్మెంట్స్ పూర్తయిన వెంటనే.. ఈ ప్రాజెక్టులో స్టిక్ అవుతారని చెప్పుకొచ్చాడు. నిజానికి.. ఈ సినిమాను ప్రభాస్ హీరోగా.. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంత్‌నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుందని మొదట్లో వార్తలు వైరల్ అయ్యాయి. కానీ.. ప్రభాస్ వరుస కమిట్మెంట్లతో చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గ‌డుపుతున్న క్రమంలో.. ఈ ప్రాజెక్టు అల్లు అర్జున్ ఖాతాలోకి చేరుకుందని సమాచారం.

Dil Raju confirms Allu Arjun-Prashanth Neel Raavanam | cinejosh.comఅల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో భారీ సైన్స్ ఫిక్షన్ డ్రామాల్లో నటించనున్న సంగతి తెలిసిందే. పునర్జన్మల కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందినట్లు టాక్. ప్రశాంత్ నీల్‌.. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డ్రాగన్ రన్నింగ్ టైటిల్ తో రూపొందుతుంది. ఇక.. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి.. అల్లు అర్జున్‌తో కలిసి సెట్స్‌లో సందడి చేయనున్నాడట.