డైనమిక్ హీరో మంచు విష్ణు లేటెస్ట్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. జూన్ 27న గ్రాండ్ లెవెల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. స్టార్ కాస్టింగ్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భారీ సక్సెస్ అందుకోలేక పోయింది. ఇ్ తాజా సాక్‌నిల్క్ అప్డేట్ ప్రకారం భారతదేశంలో కన్నప్ప ఇంకా రూ.30 కోట్ల వరకు కలెక్షన్లు కూడా టచ్ చేయలేకపోయింది. కన్నప్ప బుధవారం కేవలం రూ.1.15 కోట్ల మాత్రమే వస్తుళ్లును దక్కించుకుంది.
ఇప్పటివరకు సినిమా సింగిల్ డే వసూళ్లలో ఇదే అత్యంత తక్కువ. సోమవారం నుంచి బాక్స్ ఆఫీస్ వసూళ్లు మెల్ల మెల్లగా పడిపోతూ వచ్చాయి. ఇది మేకర్స్‌కు బిగ్ షాక్‌ను కలిగించింది. మొదటి రోజు రూ.9.35 కోట్ల వసూళ్లు కొల్లగొట్టిన మూవీ.. శనివారం ఆక్యుపెన్సీ 23.53% పడిపోయింది. అలా శనివారం రూ.7. 15 కోట్లు కొల్లగొట్టిన కన్నప్ప.. ఆదివారం రూ.6.9 కోట్లు దక్కించుకుంది. ఆరు రోజుల్లో సినిమా మొత్తం గా కలిపి రూ.28.65 కోట్ల వస్సుళ్లను అందుకుంది.
ఈ క్రమంలోనే కనీసం వారం రోజుల్లో రూ.30 కోట్ల కలెక్షన్లు కూడా కల్లగట్టకపోవడం మంచు విష్ణుకి బిగ్ షాక్ అనే చెప్పాలి. విష్ణు మొదటి నుంచి కన్నప్పను తన డ్రీం ప్రాజెక్టుగా రూపొందించారు. 10 ఏళ్ల క్రితమే దీని గురించి ప్రస్తావన వచ్చిందట. నాస్తికుడైన తిన్నడు వేటగాడు శివుని గొప్ప భక్తుడిగా ఎలా మారాడు అనే కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో విష్ణుతో పాటు.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్, కాజల్ తదితరులు మెరిశారు.