టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో 2013లో విశ్వంభర ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అవుతుందని మేకర్స్ అనౌన్స్ చేసిన పలు కారణాలతో సినిమా వాయిదా పడింది. తర్వాత.. సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో మెగా అభిమానులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. వరుసగా మెగా ఫ్యామిలీలో డిజాస్టర్లు ఎదురవుతున్న నేపథ్యంలో.. చిరంజీవి విశ్వంభర కూడా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయకపోవడంతో అసలు సినిమా వస్తుందా.. లేదా.. అనే సందేహాలు సోషల్ మీడియాలో వ్యక్తం అయ్యాయి. అయితే.. తాజాగా సినిమా రిలీజ్ ఆలస్యం అవడంపై డైరెక్టర్ మల్లిడి వశిష్ట రియాక్ట్ అయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. కేవలం సినిమా విఎఫ్ఎక్స్ కారణంగానే ఆలస్యం అయిందని.. విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కోసం సమయం తీసుకున్నామని.. వరల్డ్ టాప్ కంపెనీస్ సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం పని చేస్తున్నామంటు చెప్పుకొచ్చాడు. సినిమాకు అదిరిపోయే అతిపెద్ద సెట్స్ వేశారని.. ఒక్కోసెట్ సినిమాకు ప్రత్యేక పాత్ర పోషిస్తాయంటూ చెప్పుకొచ్చాడు. సోషియా ఫాంటసీగా రూపొందుతున్న ఈ సినిమా భారతీయ సినీ చరిత్రలోనే నెక్స్ట్ లెవెల్ వండర్ గా తెరకెక్కుతుందని సమాచారం. ఒక్క పాట తప్పించి ఆల్మోస్ట్ సినిమా పనంతా పూర్తయిపోయిందని మల్లిడి వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. ఇక టీజర్ రిలీజ్ అయిన మొదట్లో విఎఫ్ఎక్స్ గురించి వచ్చిన విమర్శలపై డైరెక్టర్ తండ్రి, ప్రొడ్యూసర్ మల్టిడి సత్యనారాయణ రెడ్డి రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే.
ఫ్యాన్స్ ఎదురు చూడడంతో వర్క్ పూర్తి అవ్వకపోయినా కూడా అభిమానులను అలరించడానికి ఏఐ సహాయంతో టీజర్‌ను పూర్తి చేశారని.. అవుట్ ఫుట్ పై వచ్చిన విమర్శలతో ఇక ఏఐని వాడకూడదని ఫిక్స్ అయ్యి జాగ్రత్తలు పడుతున్నారంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇక స్టోరీ పంచభూతాల సాయంతో శక్తులను సంపాదించి.. చెడుకు వ్యతిరేకంగా పోరాడే యువకుడి కథగా రానుందని వస్తున్న ఊహగానాలు ఏవి తప్పు కాదని వశిష్ట స్వయంగా చెప్పుకొచ్చాడు. అసలు కథ అదేనంటూ చెప్పకనే చెప్పేశాడు. ఈ క్రమంలోనే.. విఎఫెఎక్స్ స్టోరీ, రిలీజ్ డేట్ లపై వశిష్ట కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.