తారక్ చేయాల్సిన ప్రాజెక్ట్ కొట్టేసిన నాని ఇదెక్కడి ట్విస్ట్ రా సామి..!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో అనుకున్న సినిమాను.. మరో హీరోతో తెర‌కెక్కించి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ చేయడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక టాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఇలాంటి వార్తలు మరింతగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది సినిమా మొదట డైరెక్టర్ బుచ్చిబాబు.. ఎన్టీఆర్‌తో చేయాలనుకున్నాడట. కానీ.. ఆ సినిమా చరణ్ చేతికి వెళ్ళింది. తర్వాత అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ ప్లాన్ చేసిన మైథిలాజికల్ స్టోరీ ఎన్టీఆర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు.. మరో సినిమా విషయంలోను ఎన్టీఆర్ ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడంటూ న్యూస్‌ వైరల్‌గా మారుతుంది. ఈసారి ఎన్టీఆర్ నటించిన ప్రాజెక్ట్‌ నాని చేతిలోకి వెళ్లిపోయిందని.. టాక్ న‌డుస్తుంది.

Shouryuv clarifies that he is not doing any films with Jr. NTR and  says,It's all just a rumor | Telugu Movie News - The Times of India

ఇంతకీ ఆ ప్రాజెక్ట్ ఏంటి.. డైరెక్టర్ ఎవరు.. ఒకసారి తెలుసుకుందాం. గతంలో.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ శౌర్య‌వ్‌ డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా నాని చేతిలోకి వెళ్ళిపోయిందట. నాని హీరోగా నటించిన హాయ్ నాన్నతో శౌర్యవ్‌ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందిన.. ఈ ఫీల్ గుడ్ మూవీ.. డిసెంబర్, 2023లో రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత శౌర్యవ్‌.. ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడంటూ టాక్ వైరల్ గా మారింది. శౌర్యవ్‌ వినిపించిన కథ తారక్‌కు బాగా నచ్చేసిందని.. అయితే అప్పటికే స్టార్ డైరెక్టర్ తో బిజీ లైన‌ప్‌ ఉన్న తారక్.. తాజాగా శౌర్యవ్‌ కథ నుంచి డ్రాప్ అయ్యాడని టాక్.

Director Shouryuv on 'Hi Nanna': It is a tender story…

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టులో నాని ఎంట్రీ ఇచ్చాడంటూ వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. హాయ్ నాన్న‌ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రానున్న మూవీ కావడం.. అంతేకాదు.. ఈ సినిమాని కూడా వైరా ఎంటర్టైన్స్ బ్యానర్ పైన రూపొందించనున్నారు అంటూ వార్తలు వైరల్ కావడంతో.. సినిమాపై ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది. ఇక ఇది ఓ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా రూపొందింద‌ట. రెండు భాగాలుగా ఈ సినిమా తెర‌కెక్క‌నున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ దశలోనే రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక.. ఈ మూవీ రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైనర్‌ల‌కు భిన్నంగా ఉంటుందని టాక్‌ నడుస్తుంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుందట.