వీర హరిహర వీరమల్లు: అమెజాన్ ప్రైమ్ తో మీటింగ్ ఫెయిల్.. ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేక్..!

ఇండస్ట్రీలో నిర్మాతలతో.. డిజిటల్ సంస్థలు ఆడుతున్న ఆటలు హద్దులు మీరిపోతున్నాయి. అక్కడున్నది పవర్ స్టార్ అయినా, సూపర్ స్టార్ అయిన, దర్శకధీరుడు రాజమౌళి అయిన.. ఎవరి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్స్ మూవీ అయినా.. అది రిలీజ్ అవ్వాలంటే ఓటిటి సంస్థల పర్మిషన్ ఉండాల్సిందే అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజున రిలీజ్ చేస్తున్నామంటే.. అదే డేట్ లో సినిమా వచ్చేయాలా.. లేదా.. అనేది కూడా ఓటీటీలు నిర్ణయించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో పరిస్థితి మరి ఇంత దారుణంగా మారడం అందరికి షాక్‌ను కలిగిస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాలైనా ఓటీటీ సంస్థల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇక‌ ఇప్పటికే ప‌లుసార్లు వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇప్పటి వరకు ప్రకటించక పోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే.

Hari Hara Veera Mallu Holds Promise; Business Deals Pending?

డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ చెప్పిన తేదీకి రాకపోతే.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో భారీగా కోతలు విధిస్తామని డిమాండ్ చేసిందట. అలా అప్పటివరకు అమెజాన్.. వీరమల్లుకి రెండుసార్లు కోతలు విధించడం.. ఇప్పుడు మూడోసారి మరి కొంత అమౌంట్ తగ్గించడానికి సిద్ధమవడంతో.. గత వారం రోజుల నుంచి నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ సంస్థతో చర్చలు జరుపుతూనే ఉన్నాడు. కానీ.. ఆ మీటింగ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయని.. రత్నం జులై 17న మూవీ రిలీజ్ చేయాలని భావిస్తుంటే.. అమెజాన్ ప్రైమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జులై 24న సినిమా రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో పక్క విజయ్ దేవరకొండ కింగ్డం జులై 25న రిలీజ్ అవుతుంది.

Pawan Kalyan and Vijay Deverakonda's big releases set for July  clash?-Telangana Today

ఈ క్రమంలోనే మేకర్స్‌లో టెన్షన్ మొదలైంది. దీంతో తప్పని పరిస్థితిలో క్లాష్‌ ఏర్పడుతుందని ఉద్దేశంతో అమెజాన్ ప్రైమ్ తో నిన్న కూడా రత్నం చర్చలు జరిపాడు. వాళ్లు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. జులై 24 లేదా.. జూలై 10న సినిమా రిలీజ్ కావాల్సిందే అంటూ ఇష్టం వచ్చిన తేదీలో సినిమా రావాలంటే మాత్రం రూ.10 కోట్లు కోత తప్పదంటూ వార్నింగ్ ఇచ్చేసారట. దీంతో.. మేకర్స్ అందోళ‌న‌లో ప‌డ్డారు. ఇక అటూ ఫాన్స్ సైతంఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. ఈ క్లాష్‌ తప్పదా.. అని టెన్షన్ లో పడిపోయారు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రౌడీ స్టార్ కింగ్టం వాయిదా పడిందని.. దానికి తగ్గట్టు మేకర్స్ ప్లాన్ కూడా చేశారంటూ టాక్ నడుస్తుంది. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్‌కు ల‌య‌న్‌ క్లియర్ అయినట్టే.. లేదంటే మాత్రం వీరమల్లుకు తిప్పలు తప్పవు.