ఆ ఒక్క రీజన్ తో ఏకంగా 25 సినిమాలకు నో చెప్పిన వెంకీ మామ.. రిజల్ట్ ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకడు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలకు క్యార్ ఆఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన వెంకీ మామ.. ఇప్పటికి ఆడియన్స్‌లో అదే క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. తాజాగా.. సంక్రాంతికి వస్తున్నాంతో మరోసారి బ్లాక్ బ‌స్టర్ కొట్టి కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ముందు వ‌రకు వెంకీ మామ చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ట్రోల్స్ చేసిన అందరికీ.. ఈ సినిమా సక్సెస్ తో స్ట్రాంగ్ కౌంటర్ వేసాడు వెంకి మామ.

వెంకటేష్ కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తన నటించిన దాదాపు అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. ఈ రేంజ్‌లో వెంకటేష్‌కు సక్సెస్ రావడానికి ప్రధాన కారణం ఆయన సినిమాల్లో కామెడీ టైమింగ్ అనడంలోనూ అతిశయోక్తి లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ మారో సినిమాలో నటించిందే లేదు. ఆయన ఏ కథనైనా అంత ఈజీగా ఒప్పుకోరు. ఈ గ్యాప్‌లో 25కు పైగా కథలను వెంకటేష్ రిజెక్ట్ చేశాడట. అయితే వెంకీ కెరియర్ లో ఒక సినిమా తర్వాత ఈ రేంజ్ లో 25 కథలను రిజెక్ట్ చేయడం ఇదే మొదటి సారట‌.

కాగా వెంకటేష్ రిజెక్ట్ చేసిన ఈ కథలన్నీ.. దాదాపు ఫ్యామిలీ ఓరియంటెడ్‌ సినిమాలేనని.. మంచి కంటెంట్ ఉన్న కథ‌లేనని.. హిట్ అయ్యే అవకాశం ఉన్న కామెడీ యాంగిల్ మిస్ అయిందని.. ఒకే ఒక్క కారణంతో డిఫరెంట్ గా ట్రై చేయాలని ఆలోచనతో ఈ కథలను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా వెంకటేశ్, త్రివిక్రమ్ డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్న ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సైతం ఫ్యామిలీ సినిమా అని.. కానీ వెంకటేష్ ఎక్స్పెక్ట్ చేసిన అంశాలన్నీ ఈ స్టోరీలో ఉన్నట్లు తెలుస్తుంది. కంటెంట్ పై నమ్మకంతో త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట వెంకటేష్.