శేఖర్ కమ్ముల మొండోడు.. తన సిద్ధాంతాలను సినిమాలుగా తీస్తాడు.. రాజమౌళి

ధనుష్, రష్మిక, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాల్లో.. సునీల్ నారంగ్‌, జాన్వి నారంగ్‌, పుష్కర రామ్మోహన్ రావు తదితరులు కీలకపాత్రలో మెర‌వ‌నున్నారు. ఇక.. ఈ సినిమా ఈనెల 20న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ లెవెల్‌లో సెలబ్రేట్ చేశారు మేకర్స్. ఇందులో స్పెషల్‌గా రాజమౌళి హాజరై సంద‌డి చేశారు. ఇక.. ఈ ఈవెంట్‌లో రాజమౌళి.. శేఖర్ కమ్ములను ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.

Rajamouli in awe of Kuberaa, lauds Sekhar Kammula's bold shift with the  social drama

శేఖర్ కొమ్ముల చాలా మొండివాడని.. తను నమ్మిన సిద్ధాంతాన్ని ఏమంటున్నా.. ఎంత ఆశ చూపినా.. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. ఒక్క ఇంచుకూడా పక్కకు జరపనివ్వడని.. ఆయన సిద్ధాంతాలను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటాడని.. సినిమాలు కూడా అలానే తీస్తారంటూ వివ‌రించాడు. ఇండస్ట్రీకి వచ్చిన పాతికేళ్లలో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. అలాంటి సినిమాలే తీస్తున్నాడు. ఆయన ఇలానే ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అంటూ డైరెక్టర్ రాజమౌళి చెప్పుకొచ్చారు.

Rajamouli in awe of Kuberaa, lauds Sekhar Kammula's bold shift with the  social drama

ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి సినిమా ట్రైలర్‌తోపాటు.. బిగ్ టిక్కెట్ ను లాంచ్ చేశాడు. ఈ వేదికపై రాజమౌళి కుబేర ట్రైల‌ర్ చూసి షాక్ అయ్యా.. ఈ సినిమాలో రిచ్, పూర్ ప్రపంచాలను ఎలా కలిపింది.. నాగార్జున, ధనుష్ గార్లను ఏ విధంగా తీసుకొచ్చారు.. వీరి మధ్య డ్రామా ఎలా ఉండబోతుందన్న.. ఆశ‌క్తి ట్రైలర్ చూస్తే మరింతగా పెరిగిందని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే సినిమాపై నాగార్జున, శేఖర్ కమ్ముల, ధనుష్ మాట్లాడుతూ అంతకంతకు అంచనాలను పెంచేసేలా కామెంట్స్‌ చేశారు. ఇక శేఖర్ కమ్ముల సినిమా గురించి మాట్లాడుతూ నా ప్రతి సినిమాకు సరస్వతి దేవి తలదించుకోకుండా చేస్తే చాలని చెప్తుంటా.. కానీ.. కుబేర సినిమాకు సరస్వతి దేవి తలెత్తుకునేలా చేస్తుందని నమ్ముతున్న అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యిన త‌ర్వాత ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.