టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న తాజా మూవీ పుష్ప 2. ఇక పుష్ప మానియా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో కానీ..విని.. ఎరుగని రేంజ్‌లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 5న సినిమాను గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం బన్నీ పై.. మెగా ఫ్యాన్స్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాల గురించి అల్లు, మెగా అభిమానుల మధ్యన సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున వివాదాలు తలెత్తుతున్నాయి. ఓ హీరో గురించి.. మరో హీరో అభిమానులు విమర్శలు చేసే ఫ్లెక్సీలను, ఫ్లక్ కార్డులను.. హైలెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలా.. అభిమానుల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం డైరెక్ట్‌గా బన్ని వరకు చేరుకుంది.
ఇలాంటి క్రమంలో డిసెంబర్ 5న సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. తాజాగా చెన్నైలో ఈ మూవీ ఐటెం సాంగ్ కిసికి లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. వేడుకల్లో కూడా కొంతమంది పవన్ యాంటీ ఫ్యాన్స్ పవన్ ను కించపరిచేలా ఫ్లకార్డ్‌లతో కనిపించారు. అయితే అభిమానులు ఇలా చేస్తున్నారంటే కచ్చితంగా బన్నీకి తెలిసే ఉంటుంది. అయినా బన్ని దీనిపై రియాక్ట్ కాకపోవడంతో.. ఆయన టీం ప్రోత్సాహం కూడా ఇందులో ఉండే ఉంటుందని అభిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్ కు సంబంధించిన పోస్ట్‌ను తాజాగా బన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.
కిసికి సాంగ్ ఫోటోతో మెసేజ్‌ను షేర్ చేసుకున్న బన్నీ.. వెంటనే దానిని డిలీట్ చేసి మళ్లీ కాసేపటికి అదే పోస్ట్ ను షేర్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బన్నీ, శ్రీలలా కలిసి ఉన్న పిక్ లో దూరంగా బ్లర్ గా ఓ అభిమాని ఫ్లెక్సీ పట్టుకొని కనిపించాడు. ఇందులో ఏం పీకలేరు బ్రదర్ పీకే.. అంటూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ట్యాగ్ ఉంది. ఈ పోస్ట్ చేసిన అల్లు అర్జున్.. వెంటనే దానిని డిలీట్ చేసి.. తిరిగి అదే పోస్ట్ కాస్త క్రాప్ చేసి షేర్ చేశాడు. దీంతో ముందు పెట్టిన ఆ పోస్ట్ కాంట్రవర్సీకి కారణమైంది. బన్నీ కావాలనే ఈ పోస్ట్ చూసి కూడా షేర్ చేసి.. మళ్ళీ వెంటనే డిలీట్ చేసి మరోసారి కాంట్రవర్సీ లేకుండా.. అభిమానులతో ఫోటోను షేర్ చేసుకున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే బన్నీ, మెగా అభిమానుల మధ్యన మరోసారి వివాదం జోరు అయింది.