బాలీవుడ్‌లో 3 సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మాన్ అఫ్ మెసేజ్ జూనియర్ ఎన్టీఆర్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న తారక్‌.. అందులో భాగంగానే ఇటీవ‌ల దేవర సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే స్వింగ్ లో మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. పాన్ ఇండియాలో వరుస పెట్టి సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో భారీ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు టాక్. ప్రస్తుతం తారక్ టైమింగ్ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇతర హీరోలను వెనక్కు నెట్టేస్తూ తన స్పీడుతో తారక్.. సినిమాలను నటించడానికి సిద్ధమవుతున్నాడు.

Jr NTR Hrithik Roshan War 2 Movie Latest Update

ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీ వార్ 2 లో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ లో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న తారక్‌ ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్ లో మరో సినిమాను నటించనున్నాడు. అంతే కాదు దేవర పార్ట్ 2 కూడా.. ఎన్టీఆర్ లైనప్‌లో ఉంది. ఇలాంటి క్రమంలో వార్ 2 పోస్టర్ య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై.. వరుసగా మరో రెండు సినిమాలకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఇప్పటికే ఆ బ్యానర్లో రెండు సినిమాలు చేసేందుకు తారక్‌ చర్చలు కూడా మొదలుపెట్టారని ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తుంది. వార్ 2తో పాటు య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై మరో రెండు సినిమాలను.. అంటే తారక్‌తో 3 సినిమాలు లాక్ చేసే ప్లాన్లో మేకర్స్ ఉన్నారట.

#YRF50 | New Logo Release | YRF | Yash Raj Films

ఈ బ్యానర్ ఎప్పుడు ఒక హీరోతో మూడు సినిమాల డీల్ కుదుర్చుకునేందుకు రెడీ గానే ఉంటుంది. అందులో భాగంగానే తారక్ తో రెండో సినిమా మూడో సినిమాకు కూడా సంతకం చేయించేశార‌ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక.. ఇటీవల బాలీవుడ్ టాప్ దర్శకుడు తారక్‌కు స్క్రిప్ట్ కూడా వినిపించారట. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా 2025 చివరినాటికి సెట్స్ పైకి వచ్చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డైరెక్టర్ పేరు మాత్రం గోప్యంగానే ఉంచుతున్నారు. యష్‌రాజ్ ఫిలిం.. ఎన్టీఆర్ కోసం ప్రాజెక్టును సమన్వయం చేస్తుందని టాక్. ఇంట్రెస్టింగ్ ఏటంటే య‌ష్‌రాజ్ ఫిలిం మూడు సినిమాల ఒప్పందం కోసం స్టార్లతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకుంటుంది. ఇలాంటి ఏర్పాటల‌కు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా లేదా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.