ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా పాలిటిక్స్‌లో స్టార్ పొలిటిషన్‌గా ఎదిగిన తర్వాత.. లగ్జరీ లైఫ్ లాడ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారు చాలామంది తమకు స్టార్డం ఇచ్చింది జనాలని మర్చిపోతారు. అయితే కొంతమంది మాత్రం జనాలను గుర్తు పెట్టుకొని వారికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనతో సమాజ సేవ చేస్తూ మంచి పేరును సంపాదించుకుంటారు. ఇలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి వరుసలో ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటివరకు దాదాపు 1200 మంది పిల్లలకు పైగా హాట్ ఆపరేషన్లు చేయించి వాళ్లకు ప్రాణం పోసిన సంగతి తెలిసిందే.
అయితే 1000 ఆపరేషన్లు అయ్యేంతవరకు మహేష్ బాబు చేసిన పని బయట ప్రపంచానికి తెలియలేదు. కొద్ది కాలం క్రితమే మహేష్ ఇలాంటి మంచి పని చేశాడన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఇక ఇలాంటి సమస్యలతో ఉన్న చిన్నారులు ఎవరైనా తన వద్దకు వెళ్తే కచ్చితంగా సహాయం చేస్తానని మహేష్ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబును మించిపోయి మరి ఓ సింగర్ తన మంచి పనితో నెటిజన్లను ఫిదా చేసింది. మహేష్ కంటే మూడు రెట్లు ఎక్కువగా అంటే ఏకంగా మూడు వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయించి రికార్డ్ క్రియేట్ చేసింది.
మహేష్ లాగా బాలీవుడ్ ఫిమేల్ సింగర్ కూడా గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు తన డబ్బుతో ఆపరేషన్ చేయించింది. ఆమె మరెవరో కాదు పాలక్ ముచ్చల్. ఎన్నో సినిమాల్లో తన పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రైవేట్ మ్యూజిక్ కాన్సెర్ట్‌తో కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటుంది పాలక్ ముచ్చల్. తన యంగ్ ఏజ్ నుంచే సింగర్ గా వ్యవహరిస్తున్న ఈ అమ్మడు తన సంపాదించిన దాంట్లో ఇప్పటి వరకు చాలా బాగాని ఈ పిల్లల ఆపరేషన్లకు ఖర్చు పెట్టింది. ఇక ఈమె డాక్టర్ కావడం విశేషం. దీంతో మొదటి నుంచే ప్రాణం విలువ, వైద్యం అందకపోతే సాధారణ ప్రజలు పడే ఇబ్బందుల గురించి ఒక అవగాహన ఉందట.
కాగా డాక్టర్ అయ్యుండి ఆమె పాటలు పాడడానికి కూడా చిన్న పిల్లలే కారణమని.. ఆమె పేద పిల్లలను సహాయం చేయాలని ఉద్దేశంతోనే పాటలు పాడుతున్నట్లు వివరించింది. తాజాగా 3వేల ఆపరేషన్స్ పూర్తి చేసిన క్రమంలో హాస్పిటల్ సిబ్బంది ఆమెకు సన్మానం చేశారు. ఇందులో పాలక్ మాట్లాడుతూ.. నా పాటలు హిట్ అయితే నాకు పేరు వస్తుంది. నాకు వచ్చిన పేరు, డబ్బు కేవలం ఈ మంచి పనుల కోసమే ఉపయోగిస్తా. నేను ఓ మ్యూజిక్ కాన్సెర్ట్ చేస్తే దానికి వచ్చిన డబ్బుల దాదాపు 14 మంది ఆపరేషన్స్ కి వస్తుంది. అందుకే ఆ పని చేస్తున్నాను అంటూ వివరించింది. అంతేకాదు ఇంకా నా దగ్గర ఉన్న లిస్టులో 400 మందికి పైగా ఆపరేషన్స్ జరగాల్సి ఉందని.. వారికి కూడా ఎలాగైనా ఆపరేషన్ చేయించి తీరుతానంటూ చెప్పుకొచ్చింది. పిల్లల ప్రాణాలు కాపాడితే వచ్చినంత ఆనందం.. డబ్బు సంపాదించిన దాచుకున్న రాదంటూ చెప్పుకొచ్చింది. ముచల్
View this post on Instagram