సౌత్ సినీ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ భారీ పాపులారిటి దక్కించుకున్న వారిలో నటి సీతారా ఒకరు. ఆమె కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా చేసిన హల్లుండా ధావన్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో తల్లి, అత్త, పిన్ని, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సినిమాలకు దూరమైన సితార బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేస్తుంది.
50 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్న అ ఆమ్మడు తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేసింది. నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇదేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. సినీ ఇండస్ట్రీలో టాప్ నటిగా కొనసాగుతున్న టైం లోనే ఒకరిని గాఢంగా ప్రేమించానని నా దురదృష్టం ఏంటో కానీ ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదంటూ వివరించింది.
అయినా నేను ఇప్పటికీ అతని జ్ఞాపకాలు, ఆలోచలోనే ఉన్నా అంటే వివరించింది. అతనితో నాకు ఉన్న జ్ఞాపకాలని మర్చిపోలేను.. అందుకే ఇంకెవరిని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదంటూ చెప్పుకొచ్చింది. ఇప్పటికీ పెళ్లి పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అలాగే మరో బలమైన కారణం కూడా ఉంది.. అదే నా తల్లిదండ్రులు.. వారిని వదిలి నేను ఉండలేను.. అందుకే పెళ్లి చేసుకోకుండా వీళ్ళతోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఇక మా నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి చేసుకుని మరొకరితో సెటిల్ అవ్వాలని ఆలోచన ఇప్పటివరకు రాలేదంటూ వివరించింది.