బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి భార్య కాబోతున్న త్రిష.. దారుణంగా ట్రోల్స్ చేస్తున్న ఫ్యాన్స్…!

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రెండు దశాబ్దాల పాటు తన కెరీర్ ని ఇండస్ట్రీలో కొనసాగిస్తూ.. ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ లకి పోటీగా నిలుస్తున్నటువంటి త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటన‌తో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తమిళ్ స్టార్ హీరోలు అజిత్, కమల్ హాసన్ తో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో నటించేందుకు సిద్ధమయ్యింది. తమిళ్ డైరెక్టర్ వినయ విష్ణువర్ధన్, సల్మాన్ ఖాన్ తో ” ది బుల్ ” అనే సినిమాని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ మూవీని.. 1988 ఆపరేషన్ కాక్టస్ కాన్సెప్ట్ తో తెరకెక్కించనున్నారు.

ఇక ఇందులో ఫరూక్ పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా.. అతని భార్యగా త్రిష నటిస్తున్నట్లు బాలీవుడ్ లో ఓ వార్త వైరల్ అవుతుంది. త్రిష పాత్రకి కథలో చాలా ప్రాముఖ్యత ఉందని.. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ లాంచ్ కూడా అయిందని.. వచ్చే ఏడాది రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సల్మాన్ కి భార్య కాబోతున్న త్రిషన అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.