కొత్త సంవత్సరం వేడుకలు స్టార్ట్… హీరోలంతా ఆ ప్లేస్ ల‌కి తరలింపు…!

కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరూ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేసుకునే ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే సినీ సెలబ్రిటీలు ఫ్యామిలీలతో కలిసి విదేశాలకు వెళుతున్నారు. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ దంపతులు వారి పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లారు.

ప్రస్తుతం మహేష్ బాబు సైతం తన భార్య పిల్లలను తీసుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు విదేశాలకు చేరుకున్నారు. ఇక తాజాగా మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తన కుటుంబంతో కలిసి కనిపించాడు. సాధారణంగానే మహేష్ తరచూ తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటాడు.

అయితే ఈసారి కేవలం సెలబ్రేషన్స్ కోసం మాత్రమే కాకుండా షూటింగ్ పనుల మీద కూడా దుబాయ్ కి వెళ్లారట. ఇక ఇలా మన టాలీవుడ్ టాప్ హీరోలు అందరూ తమ ఫ్యామిలీ లతో కలిసి తమకి ఇష్టమైన ప్లేస్ కి వెళ్లి అక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.