ఆ స్టార్ హీరో కి స్పెషల్ విషెస్ తెలియజేసిన వెంకీ మామ… ట్వీట్ వైరల్…!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించిన సల్మాన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే నేడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టార్ హీరోలు, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు ఈయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ఈ లిస్టులో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ సైతం ఉన్నారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు వెంకటేష్. ” మేరా భాయ్ మేరా జాన్, హ్యాపీ బర్త్ డే ” అంటూ ట్వీట్ కింద రాసుకొచ్చాడు వెంకటేష్.

ఇక వెంకి షేర్ చేసిన ఫోటో బేబచ్చంగా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇక ఈ ఏడాది సల్మాన్ టైగర్ 3 మూవీతో సూపర్ హిట్ విజయాన్ని సాధించాడు. అదేవిధంగా వెంకటేష్ ఈ సంక్రాంతికి సైంధవ్ అనే సినిమాతో ప్రేక్షకులందరికీ రానున్నాడు. ఇక ఈ సినిమాపై వెంకీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ప్రస్తుతం వెంకటేష్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.