రేయ్ రేయ్ రేయ్..ఇది మరీ టూ మచ్ రా బాబోయ్.. ఇక వదిలేయండ్రా..!!

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఎప్పటికీ పాతబడిపోవు. రోజుకి రోజుకి ట్రెండీగా.. మారుతూ సరికొత్త విధంగా సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంటాయి.. నిన్న మొన్నటి వరకు నాగచైతన్య – సమంతల విడాకుల మేటర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూసాం. అయితే ఇప్పుడు ట్రోలర్స్ వాళ్లను పక్కన పెట్టేసి తెలుగు హీరోలపై పడ్డారు .

సమంతకు అన్యాయం చేశారు అంటూ కొత్త వార్తను ట్రెండ్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు సమంతని బాగా వాడుకున్నారని.. ఆమెతో సినిమాలు చేసే మూమెంట్లో ప్రమోషన్స్ కోసం నవ్వుతూ బాగా ఎంజాయ్ చేశారని .. తీరా ఆమె భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత కుమిలిపోతూ ఉంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదని .. పలువురు హీరోలను నెట్టింట ట్రోల్ చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ – చరణ్ – మహేష్ – బన్నీలను ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళ నలుగురు కూడా సమంతతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.. నలుగురు నటించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ టైంలో బాగా సమంతని వెనకేసుకొచ్చిన వీళ్ళు విడాకుల తర్వాత పట్టించుకోకపోవడం చాలా దారుణం అంటున్నారు .. బనీ ఊ అంటావా మామ సాంగ్ తర్వాత సమంతను పట్టించుకున్నదే లేదు అంటూ ట్రోల్ చేస్తున్నారు..!!