చెర్రీ పై ప్రశంసల వర్షం కురిపించిన ఉపాసన.. ఎందుకంటే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన టాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఇక ఉపాసన హీరోయిన్ కాకపోయినప్పటికీ.. తన అమూల్యమైన మనసుతో అందరిని ఆకట్టుకుంది. పలు సేవలు చేస్తూ తన మనసును చాటుకుంది.

ఇక మెగా కుటుంబానికి తగ్గ కోడలు అనిపించుకుంది. ఇక వీరి పెళ్లై 11 ఏళ్ళ అనంతరం ఓ కూతురు జన్మించింది. ఆమె పేరు క్లీంకార. ఇక తాజాగా మెగా కుటుంబంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు మెగా కుటుంబంతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరైంది.

ఇక ఈ వేడుకలో చరణ్ క్లీంకార ను ఎత్తుకున్న ఫోటోను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ… బెస్ట్ డాడ్… అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఉపాసన పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇక చరణ్ తాజాగా గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై చెర్రీ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.