టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా కొనసాగిన పూజ హెగ్డే ఇప్పుడు అవకాశాలు లేక డీల పడిపోయింది. ఇక గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ఎదురవడంతో ఈమె కెరీర్ కు బ్రేక్ పడింది. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ ఈ సంవత్సరం ఒక సినిమా కూడా చేయలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ బోల్డ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
లేడీ ఓరియంటెడ్ జోనర్ లో తెరకెక్కనున్న ఈ మూవీకు బాలీవుడ్ డైరెక్టర్ అజయ్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. డిఫరెంట్ కాన్సెప్ట్ తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజ హెగ్డే క్యారెక్టరైజేషన్, బోల్డ్ లుక్, రస్టిక్గా ఉంటాయట.
ఈమె కెరీర్ లో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు సమాచారం. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులు..” పాపం ఆ డైరెక్టర్. ఇక వాడికి జీవితమే ఉండదు. ఈ పాప ఐరన్ లెగ్ గురించి తెలియదేమో ” అంటూ అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు.