“ఎందుకో ప్రభాస్ లో నాకు ఆ విషయం నచ్చనే నచ్చదు”.. ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న రెబల్ ఫ్యాన్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ప్రభాస్ పేరు మారుమ్రోగిపోతుంది. ప్రభాస్ ఫేమ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది రెట్లు పెరిగిపోయింది. సినిమా మూడు రోజుల్లోనే ఏకంగా 407 కోట్లు దాటేసి అభిమానులకు మంచి ఫీలింగ్ కలుగజేస్తుంది . కాగా ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ నిల్ ప్రభాస్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్ తర్వాత ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కి సంబంధించిన వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ పై మాట్లాడిన మాటలు ట్రెండ్ అవుతున్నాయి. “చాలామంది ప్రభాస్ డార్లింగ్ మంచోడు అంటూ చెబుతుంటే ఏంటో అనుకున్నాను.. లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ నాకు తెలియలేదు .. చాలా చాలా మంచోడు .. ఎంత మంచోడు అంటే తన మంచితనంతోనే విసుకు తెపిస్తాడు”.

“మంచి ఫుడి భోజనంతోనే చంపేస్తాడు . ఎదుటి వాళ్ళు ఇక చాలు రా బాబోయ్ అనేంతవరకు పెడుతూనే ఉంటాడు . ఎదుటి వాళ్ళను హర్ట్ చేసే పద్ధతి ప్రభాస్ కి తెలియదు.. నేను వర్క్ చేసిన హీరోలలో ప్రభాస్ ది బెస్ట్.. అయితే ప్రభాస్ నేను ఏ సీన్ చెప్పిన సరే ఎందుకు..? కాదు.. నో.. నా వల్ల కాదు అని మాత్రం చెప్పలేదు. ఏం చెప్పినా ఓకే కమాన్ షాట్ రెడీ చేద్దాం.. అనేవాడే తప్పిస్తే ఎక్కడ నాకు నెగటివ్ గా ఆన్సర్ చెప్పలేదు”.

” ఎందుకో నాకు అది నచ్చలేదు . ప్రభాస్ లాంటి స్టార్ హీరోకి ఇంత మంచితనం ఉండడం నాకు అస్సలు నచ్చలేదు ” అంటూ నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చాడు. ప్రభాస్ పై పాజిటివ్ గా చేసిన ఈ కామెంట్స్ అభిమానులకు మాత్రం కోపం తెప్పిస్తున్నాయి . ప్రశాంత్ నీల్ పై పలువురు ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు..!!