సంక్రాంతి వేట లో నుంచి తప్పుకున్న సీనియర్ హీరో సినిమా… ఏంటి బాసు ఇది..!

మన సౌత్ ఇండియా సినిమా దగ్గర రానున్న బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదన్నా ఉంది అంటే అది సంక్రాంతి అనే చెప్పాలి. ఈ రేసులో ఒక్క టాలీవుడ్ సినిమాలే కాకుండా కోలీవుడ్ నుంచి కూడా ఎన్నో సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతాయి. ఇక ఇదే రేసులో మన టాలీవుడ్, కోలీవుడ్ తమిళ్ స్టార్స్ నటించిన సినిమాలు కూడా ఉండగా వాటిలో సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్యపాత్రలో నటించిన మూవీ ” లాల్ సలాం ” కూడా ఒకటి.

ఐశ్వర్య , రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలలో నటించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమాని మేకర్స్ సంక్రాంతి బరిలో సెట్ చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే డేట్ ని ఇంకా లాక్ చేయలేదు కానీ సంక్రాంతి రేస్ కి ఫిక్స్ చేశారు.

కానీ ఇప్పుడు ఈ బరిలో నుంచి లాల్ సలాం తప్పుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో లాల్ సలాం తో పాటుగా ఎన్నో సినిమాలు ఉన్నాయి. దీంతో అన్ని సినిమాలకి కూడా టైట్ పరిస్థితి ఏర్పడింది. ఇక ఏదోక సినిమా వెనక్కి తగ్గితే తప్ప అందరికీ బాగుండేలా లేదు. మరి ఈ సినిమా వెనక్కి వెళ్తుందో లేదా ముందుకి వస్తుందో చూడాల్సి ఉంది.