ప్రభాస్ సలార్ దెబ్బ.. షారుక్ ఖాన్ డంకి అబ్బా.. పండగ చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్..

ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన తాజా మూవీ సలార్. రిలీజ్ కి ముందే మంచి అంచనాలను సంపాదించిన ఈ మూవీ.. టికెట్స్ ఓపెనింగ్స్ లోను అదే జోరు చూపించింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ఇప్పటికే మిడ్ నైట్ షో పూర్తిచేసుకుని బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇక షారుక్ ఖాన్ – రాజకుమార్ హీరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఢంకీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నా.. సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరాశపరిచింది. అలాగే మొదటి నుంచి బుకింగ్స్ కూడా ఊహించిన రేంజ్ లో లేవు.

ఫుల్ రన్ లో ఈ సినిమా యావరేజ్ రిజల్ట్స్ అందుకుంది. ఈ నేపథ్యంలో సలార్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. క్రిస్మస్ విన్నర్ స‌లార్ అంటూ ఫ్యాన్స్‌ అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే స‌లార్ రూ.1000 కోట్ల లోడింగ్ అంటూ పలు కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక చాలా ఏరియాల్లో సలార్ టిక్కెట్లు హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. ప్రస్తుతం కొన్ని ఏరియాల‌లో టికెట్లు దొరకడం కూడా కష్టంగానే ఉంది.

ఇప్పటికే చాలా థియేటర్లు కేటాయించిన సలర్ కి ఆ థియేటర్లు చాలడం లేదు. ఇక సలర్ డే 1 కలెక్షన్స్ భారీ స్థాయిలో రావ‌డం ప‌క్క అనిపిస్తుంది. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో ప్రభాస్ స‌లార్‌తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టినట్లే. ఇక సలార్ వరల్డ్ వైడ్ టార్గెట్ రూ.800 కోట్లు కాగా ఇప్పటికే ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో.. ఖచ్చితంగా ఆ టార్గెట్ ను మించిపోయి కలెక్షన్స్ వస్తాయంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సలార్ పార్ట్ 2 వచ్చే ఏడాది మొదటి నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ లేదు.