చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని ఖచ్చితమైన లక్షణాలను కలిగి ఉంటే మెగ్నీషియం లోపం వల్లే అని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి కావలసిన పోషకాలని కచ్చితంగా డైట్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అవసరమైన ప్రోటీన్స్ల్లో మెగ్నీషియం కూడా కీలకం. కండరాలు సరిగ్గా పని చేయాలన్న, డైజెస్టివ్ సిస్టం సరిగ్గా వర్కౌట్ అవ్వాలన్నా, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా మెగ్నీషియం చాలా సహకరిస్తుంది. మెగ్నీషియం లోపం కనుక ఉంటే ఈ సంకేతాలు కచ్చితంగా శరీరంలో ఉంటాయి.
కనుక శరీరానికి తగ్గ లెవెల్లో మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ మేగ్నిషియం తక్కువగా ఉన్నట్లయితే తరచూ వికారంగా అనిపిస్తూ ఉంటుంది. బాడీలో కావలసినంత మెగ్నీషియం లేకపోతే ఆకలి కూడా అసలు వేయదట. శరీరంలో మెగ్నీషియం లెవెల్స్ తగ్గినట్లయితే హార్ట్ రెస్పాన్స్ కూడా తేడాగా ఉంటుందని, కంటి సమస్యలు కూడా ఏర్పడతాయని కళ్ళ మంట, నొప్పులు రావడం వంటివి కనపడతాయని చెప్తున్నారు.
అయితే కండరాలు తిమ్మిర్లు ఎక్కువగా ఉండటం కూడా మెగ్నీషియం లోపం వల్లే జరుగుతుందట. రక్తంలో మెగ్నీషియం గనుక లోపిస్తే ఎప్పుడు నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలసిపోయినట్లు, బలహీనంగా ఉన్నట్లు ఉంటుంది. మెగ్నీషియం లోపం ఉన్నట్లయితే నిద్రలేమి సమస్య కూడా ఉంటుందట. చిరాకుగా ఉండడం, తలనొప్పి, హెవి బ్లడ్ ప్రెషర్ ఇలాంటి సమస్యలన్నింటికి కూడా మెగ్నీషియం లోపమే కారణంఅట.