ఆ ట్రెండ్ సెట్ చేయాలంటే అనసూయ తరువాతే ఎవరైనా…నిజంగా నువ్వు కేక ఆంటీ…!!

బుల్లితెరపై అడుగుపెట్టి సెన్సేషన్ సృష్టించిన యాంకర్లలో అనసూయ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై.. ప్రస్తుతం వెండితెరపై కొనసాగుతుంది.
ఇక తెలుగులోని అగ్ర హీరోల సినిమాలలో నటిస్తుంది.

ఇక మరొకవైపు సోషల్ మీడియాలో ప్రేక్షకులని అలరిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది అనసూయ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే చీరకట్టులో కోర చూపులతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ధరించిన బ్లౌజ్ మల్టీ కలర్లో చాలా వెరైటీగా ఉంది.

స్టైలిష్ గా అనిపించే బ్లౌజ్ లో అనసూయ మెరుపు తీగలా హొయలు పోతూ నెట్టింట నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన ప్రేక్షకులు…” ట్రెండ్ సెట్ చేయాలంటే కేవలం అనసూయకే సాధ్యం “.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.