తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన జబర్దస్త్ ఫైమా.. ఏం జరిగిందంటే..?

కమెడియన్ ఫైమా.. జబర్దస్త్ రోజు ఫాలో అయ్యే వారికి ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులలో నవ్విస్తుంది. మరీ ముఖ్యంగా ఫైమా బాడీ లాంగ్వేజ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంత నవ్వకుండా కూర్చునేవారికైనా వెంటనే నవ్వు తెప్పిస్తుంది. జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఫైమా తర్వాత బిగ్‌బాస్‌లో అవకాశం అందుకుని కంటెస్టెంట్‌గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత స్టార్ మా లో పలుషోల్లో సందడి చేస్తూనే మళ్లీ జబర్దస్త్ కు వెళ్ళింది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో కమెడియన్గా కడుపుబ్బ ప్రేక్షకులను నవ్విస్తుంది.

ఇక ఇటీవల ఫైమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఆమె ఆసుపత్రిలో బెడ్ పై ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమెకు ఏమైందంటే నెట్టిజ‌న్స్‌ టెన్షన్ పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఫైమా సోషల్ మీడియా వేదికగా వీడియోని షేర్ చేసింది. అందులో ఆమె హాస్పిటల్ బెడ్ పై పేషెంట్ డ్రెస్ లో కనిపించింది. అంతేకాదు చేతికి సెలైన్ కూడా ఉంది. దీంతో నా గతమంతా నే మరిచానే అనే పాటను జోడించి పోస్ట్ చేసింది. ఫైమా ఓ పేద కుటుంబం నుంచి వచ్చి కమెడియన్గా బుల్లితెరపై పాపులాటి ద‌క్కించుకుంది. పటాస్ షోకు ఆడియన్గా వెళ్లి కంటిస్టెంట్గా మారిన ఫైమ‌ తన బాడీ లాంగ్వేజ్, పంచులు, హావభావాలతో ప్రేక్షకులను కడుపుబా నవ్వించింది.

పటాస్ నుంచి క్రమక్రమంగా జబర్దస్త్ కి అడుగులు వేసింది. జబర్దస్త్ లో తనదైన మేనరిజం టైమింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఇక బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకున్న ఫైమ‌ పదివారాలు కంటిన్యూ అయింది. ఆ హౌస్‌లో ఉండ‌గా తను పెద్ద ఇల్లు కట్టుకోవడమే తన లక్ష్యంగా చెప్పుకోచ్చిన ఫైమ‌ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత తన డ్రీమ్ హౌస్ నిర్మించుకుంది. బీడీ కార్మికురాలిగా పనిచేసిన తల్లికి వచ్చే డబ్బుతో ఫ్యామిలీని పోషించడమే అమ్మకు చాలా కష్టమయ్యేదని.. ఆమె మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది.. అందుకే అమ్మకు ఇల్లు కట్టి గిఫ్ట్ గా ఇవ్వాలని ఫైమా చెప్పుకొచ్చింది. ఇక తన గృహప్రవేశం వీడియోలు ఫైమ‌ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేసుకుంది.

 

 

View this post on Instagram

 

A post shared by FAIMA (@faima_patas)