ఆల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో శ్రీరామ్..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో శ్రీరామ్ సిపరిచితమే.. కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదట అడుగుపెట్టిన శ్రీరామ్ తెలుగులో మాత్రం ఒకరికొకరు, రోజా పూలు వంటి సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నరు.చాలా గ్యాప్ తర్వాత పిండం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో అవసరాల శ్రీనివాస్, రవి వర్మ, ఈశ్వరి రావు ఖుషి రవి తదితరులు సైతం ప్రధాన పాత్రలో నటిస్తూ ఉన్నారు. సాయికిరణ్ ధైదా దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్ సైతం మొదలుపెట్టారు. దీంతో హీరో శ్రీరామ్ ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాకు సంబంధించి తన వ్యక్తిగత విషయానికి సంబంధించి విషయాలను సైతం తెలియజేయడం జరిగింది. మొదట్లో తన సినిమా ఏదైనా హిట్ అవ్వాలంటే కచ్చితంగా ఏదో ఒక దెబ్బ తగిలించుకోవాలని ముద్ర పడిపోయిందని మొదటిలో తాను చాలా కష్టపడ్డానని 2006 నుంచి 2012 వరకు ఇండస్ట్రీకి రాకపోవడానికి తనకు ఒక ప్రమాదం జరిగిందని అందుకే రాలేకపోయాను అని తెలిపారు.

Allu Arjun's ICON Is Happening! Director Venu Sriram Refutes Rumours Of  Movie Being Shelved - Filmibeat

ఇక అప్పటి నుంచి తెలుగులో పెద్దగా కనిపించలేదని తెలిపారు. తనకు ఈగో ఎక్కువ అని ఎవరు అవకాశాలు ఇవ్వమని నేను అడగలేదని అందువల్లే రాలేకపోయాను అని తెలియజేశారు ఇక పిండం సినిమా ఈవెంట్లో చాలామంది గెస్ట్ అని పిలిచాము కానీ ఒకరు కూడా రాలేదు.. చాలామంది అసలు ఈ పిండం టైటిల్ ఏంటి నెగటివ్ అని వెళ్ళిపోయావారట.. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుందని తెలిపారు. తనకు తెలుగు హీరోలలో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని తెలిపారు.. గంగోత్రి సినిమాకు ముందు అల్లు అర్జున్ చూశాను.. ఈమధ్య ఈవెంట్లో చూశాను ఆయన నన్ను చూడగానే హే బ్రో ఎప్పిడి ఇరుకే బ్రో అంటూ తమిళంలో పలకరించారు.. ఎంతో స్వీట్ పర్సన్.. సక్సెస్ తలకెక్కని హీరో అంటూ తెలిపారు.