మంచు కుటుంబంలో గొడవలు రావడానికి కారణం అదేనా..?

మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా వివాదాలు , ట్రోల్లింగ్ వంటి వాటితో వైరల్ గా మారుతూ ఉంటారు. అయితే ఇక ఎప్పటినుంచో మంచు బ్రదర్స్ మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఈ విషయం పైన మోహన్ బాబు మాట్లాడుతూ అన్నదమ్ములు అన్న తర్వాత గొడవలు అనేవి ఉంటాయని అభిమానులు వీటిని లైట్గా తీసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఎప్పటికప్పుడు మంచు విష్ణు ,మనోజ్ మధ్య విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి.


ఇప్పుడు మంచు లక్ష్మి ,మనోజ్ ఒక పార్టీ అయితే విష్ణు కేవలం ఒక పార్టీనే దీంతో వీరందరి మధ్య విభేదాలు ఉన్నా కూడా బయటికి రాకుండా అలాగే మైంటైన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదంతా మోహన్ బాబు ఆధ్వర్యంలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే సమయం దొరికినప్పుడల్లా మనోజ్ తన అన్న విష్ణు గొడవలు ఉన్నట్లుగా ఏదో విధంగా తెలియజేస్తూనే ఉంటారు. తాజాగా సంపూర్ణేష్ బాబు సోదర అనే సినిమాకు సంబంధించి సాంగ్ విడుదల చేసి ఈవెంట్లో మనోజ్ అన్నదమ్ముల మధ్య జరిగే గొడవల గురించి మాట్లాడుతూ షాక్ ఇచ్చారు.

అన్నదమ్ముల అనుబంధం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఎప్పుడైతే యుగోలు వస్తాయో అంత అయిపోయినట్టే వారి మధ్య డబ్బు సమస్యలు అనేది రాకూడదని.. అయితే ఇలా గొడవలు అయ్యాక వారిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్యను తగ్గించుకోవచ్చు.. కానీ కుటుంబమంతా కలిసి చర్చించుకుంటే గొడవలన్నీ ఏమి చేయలేవు అంటూ తెలియజేశారు.. మరి మంచు విష్ణు తన తమ్ముడితో రాజీ కి వస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.