ఎమ్మెల్యే బర్రెలక్కకు ” బిగ్ బాస్-7 ” ఆఫర్..‌‌. గిఫ్ట్ గా ఖరీదైన కారు కూడా… పక్కా క్లారిటీ ఇచ్చేసిందిగా…!!

అప్పట్లో ఓ నిరుద్యోగి శిరీష అనే యువతి ఓ వీడియోతో ప్రపంచానికే పరిచయమైంది. ” హాయ్ ఫ్రెండ్స్ .. డిగ్రీలు ఎన్ని వచ్చినా నోటిఫికేషన్లు, ఉద్యోగాలు రావడం లేదు. మా అమ్మకి చెబితే 4 గేదెలను కొనిచ్చింది. బర్రెలను కాయడానికి వచ్చా ఫ్రెండ్స్…” అంటూ బర్రెలక్క ఏడాదిన్నర కితం నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇక ఈ వీడియో అప్పట్లో ఫుల్ వైరల్ గా మారడంతో శిరీష కు బర్రెలక్కగా ఫేమ్ వచ్చింది.

ఇక ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కావడంతో బర్రెలక్క స్వతంత్ర అభ్యర్థిగా దిగి మరోసారి వార్తల్లో నిలిచింది. నాగకర్నూల్ కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తుంది. ఈమెకి పలువురు ప్రముఖులు సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇక ఈ ఫేమ్ తోనే ఈమెకు తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 లో ఆఫర్ వచ్చిందని.. ఆమెకు ఓ కారు కూడా గిఫ్ట్ గా పంపించారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శిరీష మాట్లాడుతూ…” బిగ్ బాస్ వాళ్లు నన్ను ఇంతవరకు సంప్రదించలేదు. బహుశా నా గురించి వాళ్లకు తెలియదేమో. వారి దగ్గర నుంచి నాకు ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదు. అలాగే నాకు కారు కొనిచ్చారనేది పూర్తిగా అబద్ధం. అన్నవాళ్లు నేను ఇబ్బంది పడుతున్న అని వాళ్ళు నడుపుతున్న కార్లు తీసుకొచ్చి ప్రచారానికి వాడుకోమన్నారు. ఒక కారు మాత్రం ఒక అన్న మాత్రం ఉచితంగా ఇచ్చాడు ” అంటూ తెలిపింది. ప్రస్తుతం శిరీష వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.