అమ్మ బాబోయ్… 300 మంది డాన్సర్స్ తో ఆ పని చేయబోతున్న శ్రీ లీల… ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్స్ లో శ్రీ లీల ఒకరు. ” పెళ్లి సందడి ” సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ…” ధమాకా ” సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక తాజాగా బాలయ్యతో ” భగవంత్ కేసరి “… మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ” ఆది కేశవ ” సినిమాలు చేసి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటుంది శ్రీ లీల.

ఇక ప్రస్తుతం నితిన్ సరసన ” ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ” సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం శ్రీ లీల, నితిన్.. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ హై ఎనర్జీ మాస్ సాంగ్ షూట్ చేస్తున్నారని సమాచారం.

శంషాబాద్ లో స్పెషల్గా నిర్మించిన సెట్ లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఈ సాంగ్ కు దాదాపు 300 మందికి పైగా ఫిమేల్ డాన్సర్స్ స్టెప్పులేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ పాటతోనే సినిమా షూటింగ్ పూర్తికానుందని… ఆ తర్వాత ప్రొడక్షన్ పనులు జరగనున్నాయని తెలుస్తుంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ… ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.