ఆ టాలీవుడ్ హీరోయిన్ తో నాగచైతన్య రిలేషన్…. పాపం సమంత…!!

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్య మనందరికీ సుపరిచితమే. అక్కినేని వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన చైతు.. పెద్దగా గుర్తింపు పొందలేకపోయాడు. ఇక ఇప్పుడు తాజాగా సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా బిజినెస్ వ్యవహారాలలో కూడా నాగచైతన్య దూసుకుపోతున్నాడు. ఇక సమంత ని, నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

అనంతరం ఏవో కారణాలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటినుంచి చైతు మరొక హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు… ఆ హీరోయిన్ తో డేటింగ్ కూడా చేస్తున్నాడంటూ అనేక రూమర్లు వచ్చాయి. అయినప్పటికీ చైతు వీటిని పట్టించుకోలేదు. ఇక ప్రస్తుతం చైతు నటించిన తాజా మూవీ ” దూత “. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.‌…” నాపై ఎన్ని రూమర్స్ వచ్చిన నేనేమి వాటిని పట్టించుకోలేదు.

అంతేకాకుండా హీరోయిన్తో లింక్స్ పెడుతూ నాపై వచ్చిన వార్తలను నేనెప్పుడూ విమర్శించలేదు. ఇలాంటి విషయాలపై ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే నేనే స్వయంగా చెబుతాను ” అంటూ చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.