తెలుగు బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సైజ్ జీరో నడుముతో తన అంద చందాలతో గ్లామర్ తో కుర్రకారులకు కలల రాణిగా పేరు సంపాదించింది.. ఎంతోమంది హీరోలతో నటించిన ఇలియానా స్టార్ డమ్ రాగానే బాలీవుడ్ వైపుగా అడుగులు వేసి అక్కడ పలు సినిమాలలో నటించిన ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది. దీంతో మళ్లీ టాలీవుడ్ లోకి రావడానికి ఈమెకు అవకాశాలు వెలువడలేదు. అలా బాలీవుడ్ లోనే తన కెరియర్ నాశనం చేసుకుంది.
ఇక గత కొన్ని నెలల క్రితం పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇండియాలో పుట్టి పెరిగినప్పటికీ ఇలాంటి పనులు చేయడంతో చాలా మంది ఇలియానాను తిట్టిపోసుకోవడం జరిగింది.. ఈమె భర్త గురించి పలు రకాల రూమర్స్ కూడా వినిపించాయి. గతంలో చాలామంది నటులతో ఈమె డేటింగ్ చేసిందని వార్తలు కూడా వినిపించాయి. చాలా సందర్భాలలో ఇలియానా తన బిడ్డ ఫోటోను మాత్రమే షేర్ చేస్తూ ఉండేది తన భర్త గురించి ఎలాంటి విషయాలను కూడా తెలిపేది కాదు.
అయితే ఒక్కసారిగా మౌనంగా ఉన్న ఇలియానా తన భర్త గురించి ఇటీవల ఓపెన్ అయినట్లుగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో వారు అడిగిన ప్రశ్నలకు తన భర్త ఇతనే అంటూ తన కొడుకు తండ్రి కూడా ఇతనే అంటూ ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. అయితే తన భర్త గురించి ఎలాంటి విషయాలు మాత్రం తెలియజేయలేదు ఇలియానా. మరి రాబోయే రోజుల్లో అందుకు సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలియజేస్తుందేమో చూడాలి మరి.