సోనీ టీవీలో ప్రస్తుతం ప్రసారమవుతున్న షోలలో సింగింగ్ రియాలిటీ షో ” ఇండియన్ ఐడల్ సీజన్ 14 ” ఒకటి. ఈ షోలో ” షాందార్ పరివార్ ” ప్రత్యేక ఎపిసోడ్ ప్రచారం కాబోతుంది. ఈ సందర్భంగా ” యానిమల్ ” మూవీ జోడి రణ్బీర్ కపూర్, రష్మిక పాల్గొన్నారు. ఇక జడ్జిలుగా వ్యవహరించిన వీళ్ళిద్దరూ కంటెస్టెంట్ల పర్ఫామెన్స్ లను ఎంత గానో ఎంజాయ్ చేశారు. అయితే.. ఈ క్రమంలోనే రణ్బీర్ చేసిన పని అందరినీ ఆకర్షించింది.
మేనక పౌదేల్ అనే అంధ గాయని ” అగర్ తుమ్ సాత్ హో ” అనే పాట పాడారు. ఈ పాటను అక్కడ ఉన్న వారంతా ఎంతగానో ఎంజాయ్ చేశారు కూడా. ఇక ఈ క్రమంలోనే రణ్బీర్ ఆమె పాటను ఎంతో మధురంగా ఆలకించి ఆనందపడ్డారు. రష్మిక తో కలిసి స్టేజ్ పైకి వెళ్లి ఆ గాయని కాళ్లు మొక్కారు. అనంతరం మేనకతో మాట్లాడుతూ…నా పేరు రణ్బీర్ అంటూ పరిచయం చేసుకున్నాడు.
ఇక మీరు ఎంతో బాగా పాడారంటూ పొగిడాడు కూడా. ఇక శ్రేయ ఈ పాటను మొదటిసారి పాడినప్పుడు అందరికీ ఏ ఫీలింగ్ కలిగిందో.. ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది… అంటూ కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే రణ్బీర్ చేసిన పనిని చూసిన ప్రేక్షకులు… ప్రశంసిస్తున్నారు.
Menuka ke fan bane Ranbir aur share kiya audience se apna baby playlist.
Dekhiye #IndianIdol, Sat-Sun raat 8 baje, sirf #SonyEntertainmentTelevision par.@shreyaghoshal @VishalDadlani #KumarSanu #Hussain @fremantle_india pic.twitter.com/sgqZ0ggI6q
— sonytv (@SonyTV) November 23, 2023