అక్కినేని హీరో నాగచైతన్య కొత్తజన్నర్‌లో కథలను ఎంచుకుంటూ డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాల్లో నటిస్తే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక నాగచైతన్య త్వరలోనే దూత అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు చందు మండేటి డైరెక్షన్లో తండేల్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఈసారి పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా.. ఫాన్స్ కు సర్ప్రైజ్లు ఉంటాయి అంటూ వివరించాడు.
నా కొత్త సినిమా తండేల్ టైటిల్‌తో.. ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. అలాగే నా ఫస్ట్ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది. ఇది ఓ రేంజ్ లో ఉండబోతుంది అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను విక్రమ్ కుమార్ అద్భుతంగా రూపొందించాడని.. సీటెడ్ థ్రిలర్‌గా ఆడియన్స్ ఫీల్ అవుతారని నాగచైతన్య పేర్కొన్నాడు. సీజన్ 1 హిట్ అయితే తప్పకుండా మరో సీజన్లో ఆడియన్స్ ముందుకు వస్తాం అంటూ వివరించాడు. ఇక తండేల్ విషయానికి వస్తే ఈ సినిమాపై టీమంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. దాదాపు ఆరు నెలలుగా ఈ ప్రాజెక్టు పై పని చేస్తున్నాం. ఇక ఈ కథ ప్రకారం ఇండియాలో కొంత, పాకిస్తాన్లో కొంత జరుగుతుంది.
నా కెరీర్‌లోనే ఈ మూవీ ఓ సంచలనంగా మారుతుందని భావిస్తున్న అంటూ వివరించాడు. ఓ మత్స్యకారుడిగా నేను కనిపించబోతున్నాను.. దానికోసమే బాడీ, లుక్ అంతా మార్చాను. ఇక మత్స్యకారులు పరిస్థితులు ఏంటి.. వారు ఏ విధంగా కష్టపడతారు.. అనేదాన్నిపై అవగాహనకోసం శ్రీకాకుళంలో కె.మత్స్యలేశం గ్రామానికి కూడా వెళ్ళాం. ఏ వ్యక్తినైతే స్ఫూర్తిగా తీసుకొని చందు ఈ సినిమాను రూపొందిస్తున్నాడో.. ఆ వ్యక్తిని నేను కలిశాను. శ్రీకాకుళం యాస కూడా నేర్చుకుంటున్నాను.. ఇక నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షనన్ను చందు బాగా డిజైన్ చేశాడు.
అలాగే ఇందులో క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. సాయి పల్లవి తో లవ్ స్టోరీ.. సినిమా తర్వాత మళ్లీ నేను కలిసి నటిస్తున్న. ఆమె ఈ సినిమాలో కీ రోల్‌లో నటిస్తోంది. ఇక డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మూడు నెలలు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అల్లు అరవింద్, బన్నీ వాస్ గార్లతో సహా టీమ్ అంతా చాలా కేర్ఫుల్ గా ఈ ప్రాజెక్టును రన్ చేస్తున్నాం అంటూ వివరించాడు. ఇక ఇప్పటికే నా కెరీర్‌లో చాలా అపజయాలు, విజయాలు అన్నీ ఉన్నాయి. ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నా.. మరింత గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న.. ఈ సినిమా తర్వాత శివానిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్న. ప్రస్తుతం ఈ సినిమాపై చర్చలు నడుస్తున్నాయి అంటూ వివరించాడు.