Extra ordinary man: 300 మంది ఫారెన్ డ్యాన్సర్లతో.. శ్రీ లీలా, నితిన్ మాస్ స్టెప్పులు..

ప్రస్తుతం యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రీ లీల హీరోయిన్గా, వక్కంత వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తరకెక్కుతుంది. ఎం సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే స్పెషల్ సాంగ్ కోసం ఏకంగా 300 మంది ఫారిన్ డ్యాన్సర్లతో జానీ మాస్టర్ ప్లాన్ చేశాడ‌ట‌.

ఇక జానీ మాస్ట‌ర్ పర్యవేక్షణలో శ్రీ లీలా, నితిన్ మాస్ సాంగ్ షూటింగ్ జ‌రుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన డేంజర్ పిల్లా, బ్రష్ వేస్కో రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా మంచి ఆధ‌ర‌ణ‌ను అందుకుందంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాలో నితిన్ క్యారెక్టరైజేషన్ ప్రధాన బలం.. ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మాస్ సాంగ్ తో సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. డిసెంబర్ 8న సినిమా రిలీజ్ చేయబోతున్నాం అంటూ వివరించారు. ఈ సినిమాలో డాక్టర్ రాజశేఖర్, సుదేవ్ నాయర్‌, రావు రమేష్, రోహిణి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు.