అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకి పరిచయం అయ్యి… ప్రస్తుతం వెండితెరపై అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఒంపు సొంపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయబోతుందట.
అదికూడా తమిళంలో నయనతార హీరోయిన్గా నటించిన మూవీని.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చి.. అనసూయ ఆ సినిమా చెయ్యబోతుందట. ఇక ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ నయన్ ప్లేస్ లో అనసూయ ఎంతవరకు సెట్ అవుతుందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ” నయనతార పాత్రను.. అనసూయ మాత్రమే పోషించగలదు అనే నమ్మకం మాకుంది ” అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ బోల్డ్ బ్యూటీ ఏ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక మొత్తానికి అనసూయ ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.