సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన వారిలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ప్రస్తుతం నాని వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంకా గత ఏడాది దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని.. ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులని ఆదరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు నాని. ఈ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ సుమ కనకాల నానికి ఒక చిన్న టెస్ట్ పెట్టింది. హీరోల కొడుకుల చిన్నప్పటి ఫోటోలను సుమా నానికి చూపించి వీళ్లు ఎవర కొడుకులు అని ప్రశ్నించింది. అలా కొందరి ఫోటోలను చూపిస్తే సుమ.. నాని సైతం వాటిని గెస్ చేశాడు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పెద్ద కొడుకు ఫోటోను చూపించింది సుమ. ఈ ఫోటోను చూసిన నాని వెంటనే ఎన్టీఆర్ పెద్ద కొడుకు అంటూ చెప్పాడు.
ఈ క్రమంలోనే నాని మాట్లాడుతూ..” పెద్ద కుమారుడు ఏమో కానీ చిన్నోడు మాత్రం పెద్ద కంచు.. ప్రతి విషయంలోనూ చాలా తెలివిగా ఆలోచిస్తాడు ” అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ సైతం పలు ఇంటర్వ్యూలలో తన చిన్న కొడుకు గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చాడు. దీని బట్టి చూసుకుంటే అభయ్ తో పోలిస్తే భార్గవ్ చాలా బాగా యాక్టివ్ గా ఉంటాడని తెలుస్తుంది. ప్రస్తుతం నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.