పుష్ప జాతర సీన్స్ ఖర్చుతో.. రెండు పాన్ ఇండియా సినిమాలు తీసేయొచ్చా..!!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో రూపొందిన పుష్ప మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజై ఎటువంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల ఈ సినిమాకు ఉత్తమ న‌టుడిగా అల్లు అర్జున్ జాతియ‌ అవార్డు కూడా అందుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి పార్ట్ కు దాదాపు రూ.400 కోట్ల స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. దీంతో రెండో భాగానికి ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్ వస్తుందని మూవీ టీం సభ్యులంతా గట్టిగా నమ్ముతున్నారు. వాటి నమ్మకానికి తగ్గట్టుగానే పాన్ ఇండియా లెవెల్ లో కోట్లాదిమంది ప్రేక్షకులు ఆ సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఎప్పటినుంచో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఇప్పటికీ రెండు సంవత్సరాలు దాటిపోతున్న ఈ సినిమా రాలేదు. ఇక 2024వ సంవత్సరం ఆగస్ట్‌లో ఈ సినిమా వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అయినా తెలిస్తే బాగుంటుందని ప్రేక్షకులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ ప్రత్యేకంగా వేసిన ఓ సెట్ లో నిర్వహిస్తున్నారట. ఈ షెడ్యూల్లో జాతరకు సంబంధించిన కొన్ని సీన్స్ రూపొందించబోతున్నారట మూవీ టీం.

దర్శకుడు సుకుమార్ ఈ సినిమాలో అత్యంత కీలకమైన జాతర షూటింగ్ కి ఏకంగా రూ.15 నుంచి రూ.25 కోట్ల వరకు ఖర్చు చేశాడని తెలుస్తుంది. కాగా ఇదే బడ్జెట్ తో మనం రెండు చిన్న సైజ్‌ పాన్ ఇండియా మూవీలను ఈజీగా రూపొందించవచ్చు అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. రూ.1000 కోట్ల సినిమాకు ఆ మాత్రం ఖర్చు పెడితే తప్పేముందిలే అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా రైట్స్ కొనుగోలు చేసేందుకు భారీ ఎత్తున ఆసక్తిగా చూపురున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ హిందీ ఇతర భాషల రైట్స్‌ కు పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. దీంతో ఈ సినిమా బిజినెస్ రూ.1000 కోట్ల వరకు జరగడం అంతా కష్టం కూడా కాదు అంటూ సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది.