భగవంతు కేసరి సినిమాని అంత మాట ఆనేసిన కాజల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ వివాహమై ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కాస్త బొద్దుగా మారడంతో మళ్లీ వర్కౌట్లు చేసి.. తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టింది.. ఇటీవలే బాలయ్యతో కలిసి భగవంత్ కేసరీ చిత్రంలో నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కీలకమైన పాత్రలో శ్రీ లీల కూడా నటించడం జరిగింది.


అయితే ఇందులో కాజల్ నటించిన పాత్ర కాత్యాయని పాత్రకు మాత్రం అంతగా రెస్పాన్స్ రాలేదు.. దీంతో కాజల్ అభిమానులు రీ యంట్రి కోసం ఎదురుచూసిన నిరాశనే మిగిలింది. అయితే తన అసలు రీఎంట్రీ ఇది కాదంటూ కాజల్ తెలియజేయడం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే పెళ్లి తర్వాత భారతీయుడు-2 సినిమాతో పాటు మరో మహిళా ఓరియంటెడ్ మూవీ సత్యభామ సినిమాను కూడా చేయబోతోంది.సత్యభామ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.

ఈ భారతీయుడు-2 సినిమా కోసం కలరియట్టు అనే ఒక మరో యుద్ద రీతిని సైతం నేర్చుకున్నది. ఈ రెండు సినిమాల కోసం దాదాపుగా మూడు నెలలు కేటాయించి తన శరీరం నుండి చాలా కష్టపెట్టడం జరిగింది కాజల్ అగర్వాల్.. ఈ సినిమా షూటింగ్ సమయంలో కూడా తనకి చాలా తృప్తిగా అనిపించిందని ..కెరియర్ లో మొదటిసారి యాక్షన్ సన్నివేశాలు నటించానని ఈ రెండు సినిమాలే తన అసలైనరీ ఎంట్రి సినిమా లంటూ తెలియజేసింది కాజల్ అగర్వాల్. బాలయ్య అభిమానులు మాత్రం ఈమె పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.