సినీ ఇండస్ట్రీలో హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే చాలా కష్టమని చెప్పవచ్చు. అలా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చిత్రాలలో కచ్చితంగా ఆలీ ఉండాలి అనే అంతలా వీరిద్దరి మధ్య స్నేహబంధం ఏర్పడింది. రాజకీయ కారణాల చేత వీరిద్దరూ మధ్య విభేదాలు వచ్చాయని గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ,ఆలీ మధ్య విభేదాలపై నాగబాబు పలు రకాల వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ప్రస్తుతం ఆలీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.. ఒక ఇంటర్వ్యూలో రాజకీయంగా ఆలీ మాట్లాడుతూ అవసరమైతే తాను పవన్ కళ్యాణ్ పైన పోటీ చేయడానికి కూడా సిద్ధమే అన్నట్లుగా తెలియజేశారు. అయితే ఈ వ్యాఖ్యల పైన పవన్ కళ్యాణ్ అభిమానులు కౌంటర్లు కూడా వేయడం జరిగింది. దీనివల్ల పవన్ కళ్యాణ్ ఆలీ మధ్య దూరం పెరిగిపోయింది. తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు.. పవన్ కళ్యాణ్, ఆలీ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదంటూ స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ ఆలి ఇద్దరు కూడా మంచి స్నేహితులు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. వేరే పార్టీలో వెళ్లిపోవడంతో కళ్యాణ్ బాబు ఒక్కసారి మాత్రమే నేను ఆలికి చాలా ఉపయోగపడ్డాను ఇలా చేస్తారనుకోలేదు అంటూ తనతో ఒక్క మాట మాత్రమే చెప్పారని అంతకుమించి ఎప్పుడు కూడా గొడవ జరిగింది లేదంటూ తెలిపారు నాగబాబు.. ఆలీ పవన్ కళ్యాణ్ పై పోటీ చేస్తాను అనడం విషయాలు సీరియస్గా తీసుకోలేదని ఒక పార్టీలో ఉన్న తర్వాత హై కమాండ్ చెప్పిన విధంగా మాట్లాడాల్సి ఉంటుంది..అంతకుమించి ఏమీ ఉండదని కూడా తెలిపారు. ఇప్పటికి వీరిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారని అయినా రాజకీయాల పరంగా దూరమైతే పెరిగిందని తెలిపారు