పోయి పోయి ఆ ముసలోడిని చూజ్ చేసుకున్నావ్‌ ఏంటి చరణ్.. సినిమా దొబ్బేస్తుంది పో..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగి ప్రస్తుతం క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కీరోల్‌ ప్లే చేస్తున్నాడు రాజేంద్రప్రసాద్. ఆయ‌న‌ చేసిన చాలా సినిమాలు హిట్ కొట్టి మంచి గుర్తింపు తెచ్చాయి. అయితే ఇప్పుడు రాజేంద్రప్రసాద్ హీరోల ఫాదర్ రోల్స్ లో నటిస్తూ ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నాడు. ముఖ్యంగా నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్‌ ఫాదర్ గా ఆయన నటనను మంచిమార్కులు ప‌డ్డాయి. ఇక ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు కూడా కీలక పాత్రలో రాజేంద్రప్రసాద్ నటించబోతున్నట్లుగా సమాచారం.

అయితే ఇప్పటివరకు ఎన్నో పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఓ డిఫరెంట్ రోల్ ప్లే చేయబోతున్నాడట. కాగా మొదట్లో ఈ సినిమాకు ఓ తమిళన్నట్టుని తీసుకోవాలని భావించారట. కానీ చివరకు రాజేంద్రప్రసాద్‌ని సెలెక్ట్ చేసుకున్నారట. ఒకవేళ ఈ న్యూస్ నిజమైతే రాజేంద్రప్రసాద్ కెరీర్‌లో ఇది కూడా ఓ డిఫరెంట్ రోల్‌గా నిలిచిపోతుంది. డిఫరెంట్ రోల్ అంటున్నారు కాబట్టి ఇప్పటివరకు ఆయన చేసిన కామెడీ పాత్రలు కాకుండా ఏదో సీరియస్ రోల్ నటించబోతున్నాడేమో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

రాజేంద్రప్రసాద్ సినిమాలో ఎంతవరకు నటించి మెప్పిస్తాడు వేచి చూడాలి. ఇక ఇప్పటికే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో అతని నుంచి రాబోయే నెక్స్ట్ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. కాగా రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవ్వడంతో.. పోయి ఆ ముసలోడిని ఎంచుకున్నావ్ ఏంటి చరణ్.. నీకు ఇంకెవరు దొరకలేదా అంటూ.. ఇక ఆ సినిమా హిట్ అయినట్లే అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.