టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ సినిమా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. ఇక ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బాస్టర్ తర్వాత రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు ఎన్టీఆర్ డూప్‌ను వాడకుండా తనే స్వయంగా యాశ్రీన్ సీన్‌లలో పాల్గొంటున్నాడని సమాచారం. ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత తన 31వ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేయబోతున్నాడు.
కాగా ప్రస్తుతం ప్రశాంత్ కూడా సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇక ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. మొదటి భాగం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన రెండో పార్ట్ ని కూడా 2024 ఏప్రిల్ నెలాకరులో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఎన్టీఆర్ 31 మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో ఎన్టీఆర్ పవర్ఫుల్ లుక్‌లో కనిపించాడు. ఇక తాజాగా ఎన్టీఆర్ 31 కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాకు హీరోయిన్ గా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన శ్రీ లీలను తీసుకుంటే బాగుంటుందని మూవీ టీం భావిస్తున్నారట. అయితే ఈ సినిమాకు మొదట ప్రియాంక చోప్రా ను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. శ్రీలీల ఇప్పటికే వరుస సినిమా అవకాశాలతో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఛాన్స్‌లు కొట్టేసింది. దీంతో ఆమె క్రేజ్ రిత్యా శ్రీ లీలను ఫిక్స్ చేశారట. ఈ న్యూస్ నిజమైతే ఇక ఆమె కెరీర్‌లో మరికొంత కాలం పాటు వెనక తిరిగి చూసుకోవాల్సిన పని ఉండదు. పైగా ఎన్టీఆర్ 31 కూడా పాన్ ఇండియా లెవెల్ మూవీ కావడంతో ఈ మూవీలో శ్రీ లీల నటిస్తే ఆమె కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటుంది.