అమ్మ‌, నాన్న దూరం.. మెగా మ‌న‌వ‌రాలికి ఎంత క‌ష్ట‌మో చూశారా..!

చిరంజీవి కూతురు శ్రీజ మనందరికీ సుపరిచితమే. ఈమె కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఓ పాప కూడా జన్మించింది ‌. అయితే.. గత రెండేళ్లగా దూరంగా ఉంటున్న ఈ జంటపై అనేక వార్తలు వచ్చాయి. శ్రీజ మూడో పెళ్లి, కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఎన్ని వార్తలు వినిపించినప్పటికీ ఈ జంట మాత్రం ఏ మాత్రం స్పందించలేదు. అసలు అధికారిక విడాకులు తీసుకున్నారా? లేదా? అనేది కూడా తెలియజేయలేదు.

కానీ ఒకరినొకరు మాత్రం సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. ఇక వీరి సంగతి పక్కన పెడితే.. ఈ జంట దూరంగా ఉంటున్న నేపథ్యంలో కూతురు నవిష్క మాత్రం సఫర్ అవుతుందని చెప్పుకోవచ్చు. తల్లి వద్దే పెరుగుతున్న నవిష్క తండ్రి ప్రేమ కోసం ఆరాటపడుతుంది. అప్పుడప్పుడు కళ్యాణ్ దేవ్ వద్దకు కూడా వెళ్తుంది. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి పండుగ సందర్భంగా తండ్రి దగ్గరకు వెళ్ళింది నవిష్క‌.

తన కూతురు ఎప్పుడు వచ్చినా.. తన కూతురు తో ఎంజాయ్ చేసిన ఫోటోలను కళ్యాణ్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే దీపావళి పండగకు తన పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అయితే..” మెగా మనవరాలకి ఇంత కష్టం వచ్చిందేంటి.. తల్లిదండ్రులు ఇద్దరి ప్రేమ ఒక్కసారి పొందే అదృష్టం లేదా. శ్రీజ, కళ్యాణ్.. నవిష్క కోసమైనా మళ్లీ కలిస్తే బాగుంటుంది ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్,నవిష్క దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev)