ఆ అబ్బాయితోనే నా పెళ్లి… నిత్యామీన‌న్‌కు మ‌న‌సు మ‌ళ్లిందోచ్‌..!

నిత్యామీనన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకులని అలరిస్తుంది. ఈమె ఒకపక్క సినిమాలతో మరోపక్క వెబ్ సిరీస్ లతో కెరీర్ లో దూసుకుపోతుంది. ఈ ముద్దుగుమ్మ ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది.

ఇక ఈమె సినీ కెరీర్ గురించి పక్కన పెడితే… ఈమె పెళ్లి ఎప్పుడు అంటూ ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ మాట్లాడుతూ…” మ్యారేజ్ అనేది సోషల్ అండ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీతో ముడిపడి ఉంటుంది. కానీ నాకు అలాంటి సెక్యూరిటీ అవసరం లేదు.

ఒకవేళ అంతకుమించి ఆలోచించే అబ్బాయి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటా ” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిత్యామీనన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె వ్యాఖ్యలు చూసిన ప్రేక్షకులు…” ఆ లక్షణాలు ఉన్న అబ్బాయి తొందరలోనే రావాలని కోరుకుంటున్నాము…”అంటూ కామెంట్లు చేస్తున్నారు.