పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ లో మహేష్.. గుంటూరు కారం క్లైమాక్స్ సీన్స్ కోసం భారీ సెట్ రెడీ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కార్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఎన్నడూ లేని విధంగా ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. దీంతోపాటు ఇప్పటికే త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో వచ్చిన ఖలేజా,అత‌డు మూవీలు మంచి టాక్‌ను సంపాదించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మూవీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ షూటింగ్ జరుగుతుందట. రూ.వేల కోట్ల భారీ బడ్జెట్ తో క్లైమాక్స్ కోసం ఈ సెట్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహేష్ కోసం పీటర్ హెయిన్‌ ఓ వైవిధ్యమైన యాక్షన్ సన్నివేశాన్ని డిజైన్ చేశాడట. మహేష్ ఫాన్స్ తో పాటు ఈ సీక్వెన్స్ సాధారణ సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని టాక్. మహేష్ బాబు ఈ మూవీలో చాలా కొత్త క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని డిసెంబర్ మొదటి వారంలోపు లోపు పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా క్లియర్ చేసేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12,2024న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇక ఈ సినిమా గుంటూరు మిర్చి యార్డ్‌ నేపథ్యంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ బాడీ లాంగ్వేజ్‌కి సరిపడా సరికొత్త మాస్ స్టోరీ తో త్రివిక్రమ్ ఈ సినిమా ప్లాన్ చేశాడట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. ఆ పద్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగిందట. ఇక ఈ సినిమా రిలీజై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.