గత కొన్నేళ్లుగా బాలీవుడ్లో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అభిమానులను ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కానీ షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే మెప్పిస్తూ ఉన్నాయి. ఇటీవల భారీ అంచనాల మధ్య సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ -3 సినిమా విడుదల కావడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమాపై సల్మాన్ ఖాన్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 94 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్లు తెలుస్తోంది.
దీపావళి పండుగకి సల్మాన్ ఖాన్ బ్లాక్ బాస్టర్ హిట్ ని కొట్టారని చెప్పవచ్చు. మొదటి రోజు సెకండ్ షో నుంచి సాలిడ్ బుకింగ్స్ రాబట్టడం జరిగిందట. నార్త్ లో కొన్ని సెంటర్లు మిడ్ నైట్ 11 వరకు 3 షోలు పడడం జరిగింది. దీంతో టపాసులు కాల్చుకుంటూ సల్మాన్ ఖాన్ అభిమానులు థియేటర్లలో నానా రచ్చ చేశారు. రెండవ రోజు కూడా ఇదే కంటిన్యూ అవుతూ చాలా థియేటర్లలో సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది.. షారుక్ ఖాన్ ఫ్యాన్స్ హృతిక్ రోషన్ అభిమానులు థియేటర్ కి వెళ్తూ ఉండడంతో ఓవర్సీస్లో ఆల్ సెంటర్లో కూడా హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయట.
టైగర్-3 సినిమా 60 కోట్ల నెట్ కలెక్షన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా రెండు రోజులకి కలిపి టైగర్-3 చిత్రం ఏకంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టినట్లు ట్రెండ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు కూడా బుకింగ్స్ బాగానే ఉండడంతో మరో రెండు రోజులు బుకింగ్స్ చేయగలిగితే టైగర్-3 చిత్రం కచ్చితంగా సాలిడ్ వీకెండ్ గా మారుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు. మరి ఓవరాల్ గా ఈ సినిమా థియేటర్లు రన్ టైంలో 600 నుంచి 800 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.