అతనితో డేటింగ్ చేస్తున్నాం నాని బ్యూటీ.. అడ్డంగా దొరికిపోయిందిగా..

సీతారామం మూవీ తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాగూర్. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ట్రెడిషనల్ లుక్‌లో అచ్చ తెలుగు ఆడపిల్లల ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ పక్క టాలీవుడ్‌లో వరుస అవకాశాన్ని అందుకుంటూనే.. బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుని బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం నాని సరస‌న హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ, విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో జ‌త‌క‌ట్ట‌బోతుంది. అంతేకాకుండా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన పీపా అనే బాలీవుడ్ మూవీలో కీలకపాత్రలో నటించింది.

ఇక ప్ర‌స్తుతం ఈ బ్యూటీ లవ్ ట్రాక్ నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రెండో రోజుల క్రితం బాలీవుడ్ భామ శిల్పా శెట్టి దివాలి సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. ఈ ఇవెంట్‌లో భాగంగా మృణాల్ బాలీవుడ్ ర్యాపర్ భాద్‌షాతో కలిసి కనిపించింది. ఇక పార్టీ అంటే సెలబ్రిటీస్ కనిపించడం కామన్. కానీ ఈ పార్టీలో మృణాల్ బాద్‌షా చేతులు పట్టుకొని రావడం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా ఇద్దరు ఓకే కార్ లో వచ్చి, వెళ్లారు. దీంతో మృణాల్ అత‌డితో డేటింగ్్‌లో ఉందంటూ న్యూస్ జోరుఅందుకుంది. సాధారణంగా ఓ హీరోయిన్ రెండు సినిమాలు హిట్ కొట్టిందంటే ఆమెపై రూమర్స్ కోకొల‌లుగా వస్తాయి.

అలాంటి మృణాల్‌కు అంతకుమించి హైప్‌ నెలకొంది. కాగా మృణాల్ ఎప్పుడు పెళ్లి విషయం అడిగిన ప్రస్తుతం కెరీర్ పైనే ఫోకస్ చేస్తున్నానంటూ ఆ విషయాన్ని దాటేస్తుంది. ప్రస్తుతం మృణాల్ బాద్‌షాకు సంబంధించిన పిక్స్‌, న్యూస్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల అల్లు అరవింద్ టాలీవుడ్ లో ఓ మంచి కుర్రాడిని చూసి పెళ్లి చేసుకో అంటూ మృణాల్‌ను ఆశీర్వదించగా టాలీవుడ్ యంగ్ హీరోని పెళ్లి చేసుకోబోతుంది అంటూ రూమ‌ర్‌లు మొద‌ల‌య్యాయి. దీంతో మృణాల్ అలాంటిదేమీ లేద‌ని ఆ వార్త‌ల‌కు చెక్ పెట్టింది. మరి ఇప్పుడు ఈ డేటింగ్ రూమర్స్ పై ఎలా స్పందిస్తుందో చూడాలి.