చంద్రమోహన్ కేవలం ఆ రెండు సినిమాలు తోనే ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారా…. నిజంగా గ్రేట్….!!

చంద్రమోహన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి ఎనలేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు చంద్రమోహన్. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా తమిళ్ భాషలోనూ సినిమాలు చేసేవారు చంద్రమోహన్. ఇక ఆ తర్వాత సినిమాలలో హీరోగా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. అన్న, తండ్రి, బాబాయ్ పాత్రలలో నటించి ప్రేక్షకులని అలరించారు.

పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ వంటి సినిమాలు చంద్రమోహన్ కెరీర్ ని పూర్తిగా మార్చేశాయి. అంతేకాదు చంద్రమోహన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి. చంద్రమోహన్ ఎన్ని సినిమాలు చేసిన తన కెరీర్ లో ఈ రెండు సినిమాలు మాత్రం ది బెస్ట్ గా మిగిలిపోయాయి. అప్పటి తరానికే కాకుండా ఇప్పటి తరాన్ని కూడా మెప్పించేలా ఉన్నాయి ఈ సినిమాలు.

ఈయనకి ఈ రెండు సినిమాల తోనే ఎక్కువ పాపులారిటీ వచ్చింది అని కూడా చెప్పొచ్చు. చంద్రమోహన్ సరసన దాదాపు 60 మంది హీరోయిన్లు నటించారు. దాదాపు చంద్రమోహన్ హీరోగా 175 సినిమాలు చేశారు. ఇక ఈయన మొత్తం సినిమాల లిస్ట్ 900 కు పైగానే ఉంది. తన నటనకు గాను ఎన్నో అవార్డులు సైతం అందాయి. ప్రస్తుతం చంద్రమోహన్ మన మధ్య లేకపోవడం బాధాకరం.