టాలీవుడ్ లో ఎవ్వరు చనిపోయిన ఆ దరిదాపుల్లో నాగార్జున ఎందుకు కనిపించడో తెలుసా?.. అసలు కారణం ఇదే….!!

అక్కినేని నాగార్జున ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసత్వాన్ని అందుపుచ్చుకొని… ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు నాగార్జున. అనేక సినిమాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సైతం పొందాడు. ఇక నాగార్జున నలభై పదుల వయసు దాటినప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. నాగార్జున సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెలబ్రిటీ మరణించిన.. వారిని చూడడానికి వెళ్ళడు అనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కృష్ణంరాజు మరణించిన సమయంలో కూడా ఎంతోమంది సెలబ్రిటీలు వచ్చినప్పటికీ.. నాగార్జున మాత్రం రాలేదు. దాసరి నారాయణరావు భార్య పద్మా మరణించిన సమయంలో మాత్రమే నాగార్జున వారి ఇంటికి వెళ్ళాడు. అది కూడా మూడవరోజు ఏదో పనిమీద వెళ్లి అక్కడ అతన్ని పలకరించి వచ్చాడు. ఇలా నాగార్జున ఎవరు మరణించిన వారి ఇంటికి వెళ్లలేదు. కానీ తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు, తల్లి అన్నపూర్ణమ్మ మరణించిన సమయంలో సినీ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్లారు.

నాగార్జున ఎవరి ఇంటికి వెళ్లకపోయినప్పటికీ అతని కుమారులు మాత్రం ప్రతి ఒక్కరి మరణానికి హాజరయ్యేవారు. వారు ఎంత చిన్న సెలబ్రిటీ అయినా సరే వారు మరణిస్తే అక్కడికి వెళ్లి అఖిల్, నాగచైతన్య పలకరించి వచ్చేవారు. కాగా నవంబర్ 11వ తేదీన ప్రముఖ సెలబ్రిటీ చంద్రమోహన్ మృతి చెందినప్పటికీ ఎంతోమంది సెలబ్రిటీలు తరలి వెళ్లారు. నాగార్జున మాత్రం వెళ్లలేదు. నాగార్జున మరణించిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడు? అని సందేహాలు ఇప్పటికి కూడా అలానే ఉండిపోయాయి. దీనిపై ఏవిధంగా నాగార్జున నోరు విప్పలేదు.